Share News

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

ABN , Publish Date - May 10 , 2024 | 12:23 PM

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chintala Ramchandra Reddy), మాజీమంత్రి కృష్ణాయాదవ్‌లు ఆరోపించారు.

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

- మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి

హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chintala Ramchandra Reddy), మాజీమంత్రి కృష్ణాయాదవ్‌లు ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను రద్దు చేయడం ఎవరి తరం కాదని ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్ష పార్టీలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలే తిప్పి కొడతారని వారన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

శుక్రవారం బర్కత్‌పుర(Barkatpura)లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని దీనిని ఎస్సీ, ఎస్టీ, బీసీలు గ్రహించి ప్రతిపక్ష పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని, వాటిని మాత్రమే రద్దు చేస్తామని బీజేపీ(BJP) అగ్రనాయకత్వం ప్రకటించిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై లీగల్‌ నోటీసులు జారీ చేశామని పరువు నష్టం దావా కూడా వేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌. ఎన్‌. గౌతమ్‌రావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌, బీజేపీ నేతలు వేముల అశోక్‌కుమార్‌, అమర్‌నాథ్‌, రచనారెడ్డి, ఎంవీ సుభాష్‌, రాజశేఖర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Vishveshwar Reddy: ప్రజలందరూ మోదీని ఆశీర్వదించాలి

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 10 , 2024 | 12:23 PM