Share News

IPL 2024: నేడు GT vs CSK కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇక ఇంటికే

ABN , Publish Date - May 10 , 2024 | 11:06 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2024: నేడు GT vs CSK కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇక ఇంటికే
ipl 2024 GT vs CSK 59th match win prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్‌లో సజీవంగా ఉండాలంటే గుజరాత్(GT) జట్టు తప్పక గెలవాల్సిందే, లేదంటే ఇంటికే. మరోవైపు గాయం, అంతర్జాతీయ కట్టుబాట్ల కారణంగా ప్రధాన బౌలర్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్(CSK) కూడా ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఈ మ్యాచ్ ఓడితే ప్లేఆఫ్‌ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


గుజరాత్ టైటాన్స్(GT) 11 మ్యాచ్‌లు ఆడగా 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో జట్టు దిగువకు పడిపోయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్(CSK) 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించింది. జీటీపై ఈ జట్టు గెలవడం చాలా ముఖ్యం. కానీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లో గెలిచి చెన్నై ఆటను చెడగొట్టాలని భావిస్తోంది. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే నేటి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ జట్టు 42 శాతం గెలిచే అవకాశం ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 58 శాతం ఛాన్స్ ఉంది.


చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు ప్రాబబుల్ 11లో రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, మొయిన్ అలీ/డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ప్రాబబుల్ 11లో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ కలరు.


ఇది కూడా చదవండి:

Virat Kohli: PBKSపై RCB గెలుపు.. విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్


ఒలింపిక్స్‌ నుంచి బజ్‌రంగ్‌ అవుట్‌


Read Latest Sports News and Telugu News

Updated Date - May 10 , 2024 | 11:08 AM