Share News

Stock market: వరుస నష్టాలకు బ్రేక్..లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - May 10 , 2024 | 10:06 AM

దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.

Stock market: వరుస నష్టాలకు బ్రేక్..లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Stock market updates may10th2024

దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10న) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 47500 వద్ద ఆరంభమైంది. ఇక ఉదయం 10 గంటల నాటికి సెన్సెక్స్ ఏకంగా 510 పాయింట్లకుపైగా లాభపడింది. దీంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు కూడా లాభాల్లోనే దూసుకెళ్తున్నాయి.


అయితే అంతర్జాతీయ మార్కెట్లో పాజిటివ్ ధోరణులు సహా పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ షేర్లు, మెటల్ షేర్లలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో BPCL, ITC, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, NTPC కంపెనీల స్టాక్స్ టాప్ 5లో ఉండగా, LTIMindtree, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, లార్సెన్, TATA కన్జూమర్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.

మరోవైపు గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 345 పాయింట్లు పతనమై 21,957 వద్ద, సెన్సెక్స్ 1062 పాయింట్లు పడిపోయి 72,404 వద్ద, నిఫ్టీ బ్యాంక్ 533 పాయింట్లు పతనమై 47,487 వద్ద ముగిశాయి.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర


పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ


Read Latest Business News and Telugu News

Updated Date - May 10 , 2024 | 10:09 AM