Share News

Banks holiday: అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్

ABN , Publish Date - May 10 , 2024 | 07:35 AM

శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ అక్షయ తృతీయ(Akshaya Tritiya). ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు ఉంటాయా లేదా హాలిడే(holiday) ఉందా. ఉంటే ఏ ప్రాంతాల్లో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Banks holiday: అక్షయ తృతీయ సందర్భంగా ఈ ప్రాంతాల్లో బ్యాంకులు బంద్
Akshaya Tritiya 2024 banks close or not

శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ అక్షయ తృతీయ(Akshaya Tritiya). ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీరు బంగారం(gold) కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంకు నుంచి డబ్బును విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు ఉంటాయా లేదా హాలిడే(bank holiday) ఉందా. ఉంటే ఏ ప్రాంతాల్లో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడే క్యాలెండర్ 2024 ప్రకారం ఈ రోజున అనేక ప్రాంతాల్లో ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్(Banks closed) పాటిస్తున్నాయి. ఈ క్రమంలో బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా మే 10న కర్ణాటక( Karnataka) రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. కానీ నేడు ఈ నగరాల్లో మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.

వాటిలో న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై, లక్నో, అహ్మదాబాద్, అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, కోహిమా, నాగ్‌పూర్, పనాజీ , పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం ఉన్నాయి.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర


పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ


Read Latest Business News and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:39 AM