Share News

Viral video: బాలిక లిఫ్ట్‌లో ఉండగా.. సడన్‌గా లోపలికి వచ్చిన కుక్క పిల్ల.. అంతలోనే..

ABN , Publish Date - May 08 , 2024 | 06:53 PM

లిఫ్ట్‌లలో వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని విధంగా లోపలికి వచ్చే జంతువులు.. అనూహ్యంగా దాడులు చేస్తుంటాయి. ఇలాంటి ...

Viral video: బాలిక లిఫ్ట్‌లో ఉండగా.. సడన్‌గా లోపలికి వచ్చిన కుక్క పిల్ల.. అంతలోనే..

లిఫ్ట్‌లలో వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని విధంగా లోపలికి వచ్చే జంతువులు.. అనూహ్యంగా దాడులు చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, లిఫ్ట్‌లో ఓ బాలికకు షాకింగ్ అనుభవం ఎదురైంది. లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో ఉన్నట్టుండి కుక్క పిల్ల లోపలికి వచ్చింది. చివరికి ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సెక్టార్ 107లో ఉన్న సొసైటీలో ఓ బాలిక (girl) లిఫ్ట్‌లో వెళ్తోంది. పై అంతస్తులోకి వెళ్లడం కోసం బాలిక లిఫ్ట్‌లోకి వెళ్లి బటన్ నొక్కింది. ఆ వెంటనే డోర్లు క్లోజ్ అవడంతో బాలిక ఒక్కటే లోపల అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇంతలో తాను దిగాల్సిన ఫ్లోర్ వస్తుంది.

Viral video: డ్రైవింగ్ చేస్తూనే డేంజరస్ స్టంట్.. వీడియో చూస్తే గూజ్‌ బమ్స్ గ్యారెంటీ..


డోర్లు తెరుచుకోగానే దిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇంతలో బయటి నుంచి సడన్‌గా ఓ కుక్క పిల్ల లోపలికి వస్తుంది. వచ్చీ రావడంతోనే (puppy attacked girl) బాలికపై దాడి చేస్తుంది. చేయి కొరకడంతో చిన్నారి గట్టిగా కేకలు వేస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి కుక్క పిల్లను బయటికి తరిమేస్తాడు. ఆ తర్వాత బాలిక లిఫ్ట్ డోర్లు క్లోజ్ చేయబోతుంది. అంతటిలో ఆగని కుక్క పిల్ల మళ్లీ లోపలికి వచ్చి దాడి చేయాలని చూస్తుంది. అయితే అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోవడంతో చిన్నారి సురక్షితంగా బయటపడుతుంది.

Viral video: అరెరే..! ఈ సింహానికి ఎంత కష్టమొచ్చింది.. జంతువులన్నీ జాలి పడేలా..


ఈ ఘటన మొత్తం లిఫ్ట్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఇలా జరిగేందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలను ఒంటరిగా పంపించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: చనువుగా ఉంటూనే.. కాబోయే భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్.. చివరకు..

Updated Date - May 08 , 2024 | 06:53 PM