Share News

Viral video: అరెరే..! ఈ సింహానికి ఎంత కష్టమొచ్చింది.. జంతువులన్నీ జాలి పడేలా..

ABN , Publish Date - May 08 , 2024 | 04:22 PM

అడవికి రాజు అనగానే సింహమే గుర్తుకొస్తుంది. దాన్ని చూడగానే రాజసం గుర్తుకురావడం సహజం. ఇక జూలు విదిలిస్తూ అది నడుస్తూ వస్తుందంటే ఎదురుగా ఎలాంటి జంతువున్నా సైడై పోవాల్సిందే. అయితే సింహాలకూ కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి...

Viral video: అరెరే..! ఈ సింహానికి ఎంత కష్టమొచ్చింది.. జంతువులన్నీ జాలి పడేలా..

అడవికి రాజు.. అనగానే సింహమే గుర్తుకొస్తుంది. దాన్ని చూడగానే రాజసం గుర్తుకురావడం సహజం. ఇక జూలు విదిలిస్తూ అది నడుస్తూ వస్తుందంటే ఎదురుగా ఎలాంటి జంతువున్నా సైడై పోవాల్సిందే. అయితే సింహాలకూ కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న సింహం వీడియో చూసి నెటిజన్లు.. ‘‘అయ్యో.. పాపం..!‘‘ అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో వాహనంలో పర్యటిస్తున్న పర్యాటకులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. వాహనంలో వెళ్తున్న వారికి దారి పక్కన చెట్ల పొదల్లో ఓ సింహం కనిపించింది. అయితే అది మిగతా సింహాల మాదిరి కాకుండా పూర్తిగా (Weakst Lion) బక్కచిక్కిపోయి కనిపించింది. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కనిపించింది. చెట్ల పొదల నుంచి రోడ్డు పైకి వచ్చిన సింహం.. అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ కనిపించింది.

Viral video: డ్రైవింగ్ చేస్తూనే డేంజరస్ స్టంట్.. వీడియో చూస్తే గూజ్‌ బమ్స్ గ్యారెంటీ..


ఈ సింహాన్ని చూడగానే పర్యాటకులు అయ్యో పాపం..! అంటూ జాలిపడ్డారు. వెంటనే వీడియోలు తీసి, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఈ సింహాన్ని చూస్తుంటే జాలేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ సింహం వెజిటేరియన్‌గా మారిందేమో’’.. అంటూ మరికొందరు, ‘‘దాన్ని వీడియో తీసే బదులు.. ఏదైనా ఆహారం ఇవ్వొచ్చుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..

Updated Date - May 08 , 2024 | 04:22 PM