Share News

Viral video: ఈ టీ దుకాణ యజమాని తెలివే తెలివి.. కోతిని భలే వాడేశాడుగా..

ABN , Publish Date - May 04 , 2024 | 08:49 PM

సాధారణంగా దుకాణ యజమానులు కోతులను చూస్తే భయపడిపోతుంటారు. ఏ సమయంలో ఎటు వైపు నుంచి వస్తువులను ఎత్తుకుపోతాయో అనుకుంటూ కాపలా కాస్తుంటారు. కోతులు కనిపిస్తే చాలు.. వాటిని ఎలాగోలా తరిమే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి..

Viral video: ఈ టీ దుకాణ యజమాని తెలివే తెలివి.. కోతిని భలే వాడేశాడుగా..

సాధారణంగా దుకాణ యజమానులు కోతులను చూస్తే భయపడిపోతుంటారు. ఏ సమయంలో ఎటు వైపు నుంచి వస్తువులను ఎత్తుకుపోతాయో అనుకుంటూ కాపలా కాస్తుంటారు. కోతులు కనిపిస్తే చాలు.. వాటిని ఎలాగోలా తరిమే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్రకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ టీ దుకాణ యజమాని కోతిని వాడుకున్న విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ టీ దుకాణంలో చాలా మంది కూర్చుని ఉంటారు. దుకాణ యజమాని వారికి టీ సిద్ధం చేసే పనిలో ఉంటాడు. అయితే ఇక్కడే ఓ విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. అక్కడే ఉన్న ఓ కోతి టీ కప్పులు, సాసర్లను కడిగే పనిలో పడింది. నీళ్ల పాత్రలో (monkey washing tea saucer) టీ సాసర్‌ను ముంచి శుభ్రం చేసింది. అది కూడా ఏదో కడిగాం అంటే కడిగాం అన్నట్లు కాకుండా.. సాసర్‌ రెండు వైపులా పూర్తిగా శుభ్రం చేసింది. మధ్యలో దాన్ని వాసన చూసి మురికి పోయిందా, లేదా అనే విషయాన్ని కూడా గమనిస్తుంది.

Viral video: వామ్మో..! ఇదేం విచిత్రం.. బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి షాకింగ్ సీన్.. కమోడ్‌ నుంచి ఏకంగా..


ఇలా మురికి పోయే వరకూ వాటిని శుభ్రంగా కడిగేసింది. దాని ప్రవర్తన చూస్తే.. టీ దుకాణంలో పనికి కుదిరినట్లుగా అనిపిస్తుంది. అంత బుద్ధిగా కోతి పని చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. కోతి నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ‘‘కోతి ఏంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అనుకుంటూ వారంతా చర్చించుకుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టీ దుకాణంలో కూలి పనికి కుదిరిన కోతి’’.. అంటూ కొందరు, ‘‘జీతం కింద అరటిపండు ఇస్తాడేమో’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ కోతి కష్టజీవిలా ఉందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3.80లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: పక్కనే ఉండి షాక్ ఇచ్చిన వధువు.. మొఖం చూడాలని వరుడు ముసుగు తీయడంతో.. చివరకు..

Updated Date - May 04 , 2024 | 08:49 PM