Share News

Viral Video: ప్రాణాలు తీసే ఏకే47తో.. ఇలాంటి వింత ప్రయోగం ఎక్కడైనా చూశారా..

ABN , Publish Date - May 09 , 2024 | 07:18 PM

వినోదాలు, వింతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు కూడా నెటిటజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి...

Viral Video: ప్రాణాలు తీసే ఏకే47తో.. ఇలాంటి వింత ప్రయోగం ఎక్కడైనా చూశారా..

వినోదాలు, వింతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే వినూత్న ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు కూడా నెటిటజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఏకే47తో చేసిన వినూత్న ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారు వాష్ (Car wash) చేసేందుకు ఓ వ్యక్తి వినూత్న ప్రయోగం చేశాడు. సాధారణంగా నీళ్లు కొట్టేందుకు అంతా ఒకే తరహా వాటర్ స్ప్రేయర్లను వినియోగిస్తారు. అయితే ఇతను మాత్రం ఇంకాస్త వినూత్నంగా ఆలోచించాడు. ఏకే47తో ఆకారంలోని డమ్మీ తుపాకీని (AK47 Dummy gun) తీసుకుని, దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చాడు. దాని ముందు వైపు ఫోమ్ బాటిల్ ఫిక్స్ చేశాడు.

Viral Video: అదృష్టమంటే ఇతడితే.. బెంచిపై కూర్చుని ఉండగా.. ఏం జరిగిందో చూడండి..


తర్వాత తుపాకీ మీట నొక్కగానే బాటిల్లోని ఫోమ్ మొత్తం అత్యంత వేగంగా కారుపై పడింది. చూస్తుండగానే కారు మొత్తం ఫోమ్ నిండిపోయింది. ఇలా క్షణాల్లో ఫైర్ చేసినంత ఈజీగా.. కారును కడిగిపారేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘క్షణాల్లో వాష్ చేశాడే’’.. అంటూ మరికొందరు, ‘‘ఐడియా అదిరింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

Updated Date - May 09 , 2024 | 07:32 PM