Share News

LokSabha Elelctions: రాయ్‌బరేలీలో కొత్త శకం ఆరంభం: ప్రియాంక

ABN , Publish Date - May 08 , 2024 | 03:11 PM

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం రాయ్‌బరేలీ మరోసారి సిద్దమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంతో పార్టీకి శతాబ్దం అనుబంధం ఉందని తెలిపారు.

LokSabha Elelctions: రాయ్‌బరేలీలో కొత్త శకం ఆరంభం: ప్రియాంక

న్యూఢిల్లీ, మే 08: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం రాయ్‌బరేలీ మరోసారి సిద్దమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంతో పార్టీకి శతాబ్దం అనుబంధం ఉందని తెలిపారు. కొత్త నాయకత్వంతో రాయబరేలీలోని ప్రజలు కొత్త శకంలోని ప్రవేశించ బోతున్నారని ఆమె పేర్కొన్నారు. రాయబరేలీ ప్రజలతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ప్రతీ ఒక్కరు ఉత్సాహంతో అందుకోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది

రాయ్‌బరేలీ, బచ్చర్వాన్‌లలో స్ట్రీట్ మీటింగ్స్ నిర్వహిస్తామని ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే తుల్వాసా, మహరాజ్‌గంజ్, హాలోర్, భవానీగఢ్, గూడ, తిలిందా, ఇన్‌చౌలీ, సుడాలి ప్రాంతాల్లో సైతం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ప్రత్యర్థిగా యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ బరిలో నిలిపింది.


గత ఎన్నికల్లో అంటే.. 2019లో రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ విజయం సాధించారు. కానీ ప్రస్తుతం ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. మరోవైపు రాహుల్ గాంధీ అమేఠీ నుంచి బరిలో దిగుతారనే ఓ ప్రచారం అయితే గతంలో వైరల్ అయింది.

Maharashtra: కాంగ్రెస్‌లో పవార్ పార్టీ విలీనం.. సంజయ్ నిరుపమ్ జోస్యం

కానీ అనూహ్యంగా రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే అమేఠీ అభ్యర్థిగా కేఎల్ శర్మ‌ను ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ అగ్రనేతలు.. ఆ పార్టీపై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు.


రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలో దింపడంతో.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించిందని ఆరోపించారు. అందుకే రాహుల్‌గాంధీని అమేఠీ నుంచి కాకుండా.. రాయ్‌బరేలీ నుంచి పోటీకి దింపారని విమర్శలు గుప్పించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ.. బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Chennai: రామేశ్వరానికి పోటెత్తిన భక్తులు..

ఇక అవే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. మరోవైపు ఈ ఎన్నికల వేళ.. ఆయన వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ నియోజకవర్గంలో పోలింగ్ పూర్తి అయిన అనంతరం.. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగారు. దీనిపైన సైతం బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 03:11 PM