Share News

Amit Shah: అమిత్‌షాకు తృటిలో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

ABN , Publish Date - Apr 29 , 2024 | 06:04 PM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Amit Shah: అమిత్‌షాకు తృటిలో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం

బెగుసరాయ్: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) సోమవారంనాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

LokSabha Elections: దేశంలో ఎయిర్ పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు


హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు నేలను తాకేలా అటూనిటూ ఊగుతూ కుడి వైపునకు ఒరుగుతూ వెళ్లింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యహరించి హెలికాప్టర్‌ను తన అధీనంలోకి తెచ్చుకుని ముందుకు నడిపించడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అమిత్‌షా ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రచారం సాగించారు. కాగా, హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణంపై అధికారులు వెంటనే విచారణ చేపట్టారు.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 06:09 PM