Share News

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

ABN , Publish Date - May 04 , 2024 | 12:26 PM

వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట. ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు.

Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం

ఇంటర్నెట్ డెస్క్: అసలే వేసవికాలం(Summer Season). ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే ఇక అంతే సంగతులు. దీర్ఘకాలిక జబ్బులున్న వారైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే మొదటికే మోసం వస్తుంది. వేసవి కాలంలో షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి వైద్యులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి వైద్యుల సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి ఆసుపత్రుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగాయట.

ఈ కేసుల్లో వ్యాధిగ్రస్తులు షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతోనే బ్రెయిన్ స్ట్రోక్(Brain Stroke) కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. మధుమేహం, బీపీతో బాధపడుతున్నవారితో సహా, సాధారణ వ్యక్తులెవరూ వేసవికాలంలో ఏసీ గదిలో కూర్చుని ఒక్కసారిగా ఎండలోకి వెళ్లవద్దు. ఎండలో నుంచి వచ్చిన వారెవరూ నేరుగా ఏసీ గదిలోకి రాకూడదు. ఎండలో నుంచి వచ్చినా.. ఏసీ గదిలోంచి వెళ్లినా.. తొలుత సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్రాంతంలో కాసేపాగాలి. లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు తరువాత ఎక్కువ మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు.


మహిళలే ఎక్కువ..

ఈ మధ్యే నమోదైన బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో మహిళలే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు షుగర్, బీపీతో బాధపడుతున్న 50 - 60 ఏళ్ల వయస్సు గలవారు స్ట్రోక్ బారిన ఎక్కువగా పడుతున్నారట.

లక్షణాలు..

  • పక్షవాతం

  • ముఖం, చేతులు, పాదాలు తిమ్మిరెక్కడం

  • మాట్లాడటంలో ఇబ్బంది

  • కంటి చూపు మందగించడం

  • తీవ్ర తలనొప్పి

  • వికారం, వాంతులు రావడం

  • శరీరం గట్టిపడటం


బ్రెయిన్ స్ట్రోక్‌ రకాలు..

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిషికి రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. ఒకటి సిస్మిక్ స్ట్రోక్. ఈ కండీషన్‌లో మనిషి మెదడుకు వెళ్లే రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో మెదడుకి రక్త సరఫరా కాదు. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇందులో మెదడు సిర చీలిక కారణంగా రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది శరీరంలోని ఏ అవయవానికైనా పక్షవాతం వచ్చేలా చేస్తుంది.

రాకుండా ఉండాలంటే...

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి తొలి గంట గోల్డెన్ అవర్‌గా చెబుతారు. గంటలోపే రోగిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఇదివరకే చెప్పుకున్నట్లు.. ఏసీ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లకూడదు. ఎండలోంచి నేరుగా ఏసీలోకి రాకూడదు. సమయానికి బీపీ, షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటికి నిత్యం మందులు వాడాలి. ఎక్కువ సేపు ఎండలో నిలబడొద్దు. ఇది వడదెబ్బకు కారణమవుతుంది. పైన చెప్పిన లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే హాస్పిటల్‌కి వెళ్లడం మంచిది.

For Latest News and Health News click here

Updated Date - May 04 , 2024 | 12:34 PM