Share News

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:32 PM

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

Lok Sabha Polls: ఉచితాలే లాస్ట్ ఆప్షన్.. బీజేపీకి బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి భారీ వ్యూహం..

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ (BJP) స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ (Congress) తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. కూటమి మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకర్షించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఉచిత హామీలనే ఇండియా కూటమి నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నా సత్ఫలితాలు ఇవ్వడంలేదు. తిరిగి ఆ విమర్శలు తమకే నష్టం చేస్తున్నాయని ఇండియా కూటమి భావిస్తోంది. దీంతో ఇక ఉచిత హామీల ద్వారానే మోదీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలనే ప్లాన్‌తో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ సైతం తన మేనిఫెస్టోలో ఉచిత హామీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినా.. ఇవి ప్రజల్లోకి అంత బలంగా వెళ్లడంలేదు. దీంతో ఓ భారీ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు తెలుస్తోంది.

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..

ప్రధానాంశాలు ఇవే..

ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ముఖ్యంగా 30 లక్షల ఉద్యోగాల భర్తీ, కుల గణన, రిజర్వేషన్ పరిమితి పెంపు, పంటకు ఎంఎస్‌పీ హామీ వంటి అనేక అంశాలతో ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోలో 7 హామీలు ఉండే అవకాశం ఉంది. యువత, మహిళలు, రైతులు, పేద వర్గాల కోసం ఇండియా కూటమి సమిష్టిగా 7 వాగ్దానాలను ప్రకటించనుంది. వీటిలో ముఖ్యమైనవి అన్ని బిపిఎల్ కుటుంబాలకు ఇంటి వద్దకే రేషన్ ఉచిత పంపిణీ, పేద కుటుంబాలకు ఏడాదిలో 6 సిలిండర్లు ఉచితం, ప్రతి ఒక్కరికీ 200 యూనిట్ల వరకు గృహవసరాలకు ఉచిత విద్యుత్తు, బాలికలకు ఉన్నత విద్య కోసం ఏకమొత్తంగా రూ.50 వేలు, రాష్ట్రాల వారీగా పాత పెన్షన్ పథకం పునరుద్దరణ, దేశ వ్యాప్తంగా కుల గణనపై వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చనున్నారు. అయితే కుల గణనపై టీఎంసీ అంగీకరించడం లేదు. ఏప్రిల్ 21న రాంచీలో జరిగే ఇండియా కూటమి భారీ సభలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ టీఎంసీ ఏడు అంశాలకు ఆమోదం తెలపకపోతే మాత్రం మరో రోజు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఇండియా కూటమి సభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పాల్గొంటారు. కులగణనకు టీఎంసీ ఆమోదం తెలపకపోవడంతో మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే సొంత మేనిఫెస్టోలు..

ఇప్పటికే వివిధ పార్టీలు లోక్‌సభ ఎన్నికల కోసం తమ సొంత మేనిఫెస్టోలను రూపొందించాయి. రాష్ట్రాల్లో అధికారంలో లేని పార్టీలు సైతం లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించాయి. వాస్తవానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పార్టీలు, కూటమి తరపున మాత్రమే ఎన్నికల ప్రణాళికను ప్రకటించి అమలు చేయగలవు. కనీసం వంద సీట్లలో పోటీ చేయని పార్టీలు సైతం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలను రూపొందించి.. ఉచితాలకు పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలను ఆకర్షించి.. ఓట్ల పొందడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉచితాలతో బీజేపీ స్పీడ్‌కు ఇండియా కూటమి బ్రేకులు వేస్తుందా.. లేదా అనేది జూన్4 ఫలితాలతో తేలనుంది.

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 05:32 PM