Share News

Amit Shah : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...

ABN , Publish Date - Apr 20 , 2024 | 05:18 PM

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. నిషేధిత సంస్థలు పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలు పునరజ్జీవనం పొందుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. దీంతో పీఎప్‌ఐ సంస్థకు రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా మారిందని ఆరోపించారు.

Amit Shah : కాంగ్రెస్‌కు ఓటు వేస్తే...
Anith Shah

జైపూర్, ఏప్రిల్ 20: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. నిషేధిత సంస్థలు పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలు పునరజ్జీవనం పొందుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. దీంతో పీఎప్‌ఐ సంస్థకు రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా మారిందని ఆరోపించారు.

అదే బీజేపీకి ఓటు వేసి ఉంటే ఆ సంస్థను నామరూపాలు లేకుండా చేసేవాళ్లమన్నారు. శనివారం రాజస్థాన్‌ కోటాలో విజయ్ సంకల్ప్ మహాసమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. పీఎప్‌ఐపై నిషేధం ఎత్తి వేస్తామని ఆ పార్టీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధక పార్టీ అని ఆయన అభివర్ణించారు.

Yogi Adithyanath: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. మమతపై యోగి ఫైర్..

పీఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించడాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్వాగతించిందని తెలిపారు. అలాగే ఈ తరహా చర్యలే ఆరెఎస్ఎస్‌పై తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ఈ సందర్బంగా ఆయన సూచించారు. అయితే మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయన్నారు.


ఒక వైపు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తెలిపారు. ఆయన దేశం కోసం గత 23 ఏళ్లుగా అంకిత భావంతో పని చేస్తున్నారని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ఉన్నారని చెప్పారు. అయితే ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారని.. కానీ ప్రతి సారి ఆయన విఫలమవుతూ వస్తున్నారన్నారు.

రాజస్థాన్‌లో తొలి దశ పోలింగ్ భాగంగా 12 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయని.. అవన్నీ బీజేపీ ఖాతాలోనే పడతాయన్నారు. అయితే మూడోసారి మోదీ ప్రధాని పీఠాన్ని అధిష్టించేందుకు రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని ఆ రాష్ట్ర ప్రజలకు అమిత్ షా పిలుపు నిచ్చారు.

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఇక రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లట్‌పై అమిత్ షా విమర్శలు గుప్పించారు. తన కుమారుడు వైభవ్ గెహ్లెట్ కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఇరుక్కుపోయాడని ఆరోపించారు. అయితే జలోర్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దిగిన వైభవ్ గెహ్లట్ భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలవుతున్నారని అమిత్ షా ప్రకటించారు.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 20 , 2024 | 05:18 PM