SBI: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్!
ABN , Publish Date - May 15 , 2024 | 03:55 PM
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఈ క్రమంలో రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కస్టమర్లకు వడ్డీ రేట్లను ఎస్‌బీఐ పెంచింది. ఈ క్రమంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI కొత్త వడ్డీ రేట్లను 0.25 నుంచి 0.75 శాతం వరకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు మే 15, 2024 నుంచి కస్టమర్లకు అమల్లోకి వస్తాయి. దీంతో మీరు FDపై 5 శాతం వడ్డీని పొందుతున్నట్లయితే, ఇప్పుడు మీరు 5.75 శాతం పొందుతారు. SBI తన కస్టమర్లకు కనీసం 7 రోజుల FDని కూడా అందిస్తోంది.
ఇది వివిధ పదవీకాల FDలకు విభిన్న వడ్డీ రేట్లు ఉంటాయి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్‌లకు కూడా 0.50 శాతం వరకు అదనపు వడ్డీ లభిస్తుంది.
7 రోజుల నుంచి 45 రోజుల వరకు, సాధారణ వ్యక్తులు 3.5 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు ఇప్పుడు FD పై 4 శాతం వడ్డీని పొందుతారు.
46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై సామాన్యులకు ఇప్పుడు 4.75 శాతానికి బదులుగా 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 6 శాతం ఉంటుంది.
ఇక 180 రోజుల నుంచి 210 రోజుల కాలానికి వడ్డీ రేటు 5.75 శాతానికి బదులుగా 6 శాతం. సీనియర్ సిటిజన్లకు ఇది 6.5 శాతంగా ఉంటుంది.
ఇంతకుముందు 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో FDలపై 6 శాతం వడ్డీని పొందేవారు. ఇప్పుడు అది 6.25 శాతానికి చేరుతుంది. సీనియర్ సిటిజన్లకు ఇది 6.75 శాతంగా ఉంటుంది.
ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి వడ్డీ రేటు 6.8 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఇది 7.3 శాతంగా ఉంటుంది.
ఇది కాకుండా కొత్త వడ్డీ రేటు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ, 3 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 7 శాతం, 3 సంవత్సరాల కంటే ఎక్కువ కానీ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి 6.75 శాతంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
ఎఫ్ అండ్ ఓ పెట్టుబడులపై జాగ్రత్త!
Read Latest Business News and Telugu News