Share News

Lokesh: క్రైస్తవుల‌కు ప‌విత్రమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పిన లోకేష్

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:19 AM

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రైస్తవుల‌కు ప‌విత్రమైన గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ద‌యామ‌యుడైన ఏసుక్రీస్తు త్యాగ‌మే గుడ్‌ఫ్రైడే అని అన్నారు. త‌న జీవితాన్ని ప్రపంచానికి గొప్ప సందేశంగా జీసస్ అందించారని కొనియాడారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రైస్తవుల‌కు ప‌విత్రమైన గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ద‌యామ‌యుడైన ఏసుక్రీస్తు త్యాగ‌మే గుడ్‌ఫ్రైడే అని అన్నారు. త‌న జీవితాన్ని ప్రపంచానికి గొప్ప సందేశంగా జీసస్ అందించారని కొనియాడారు.

Lokesh: క్రైస్తవుల‌కు ప‌విత్రమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పిన లోకేష్

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప‌విత్రమైన గుడ్ ఫ్రైడే (Good Friday) సంద‌ర్భంగా క్రైస్తవుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ద‌యామ‌యుడైన ఏసుక్రీస్తు (Jesus Christ) త్యాగ‌మే గుడ్‌ఫ్రైడే అని అన్నారు. త‌న జీవితాన్ని ప్రపంచానికి గొప్ప సందేశంగా జీసస్ అందించారని కొనియాడారు. ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, క్షమ, త్యాగ మార్గాన్ని అనుస‌రించడం ద్వారా గుడ్ ఫ్రైడేని వేడుక‌గా చేసుకోవాల‌ని కోరుకుంటున్నానని లోకేష్ ఆకాంక్షించారు.

కాగా ఏపీ పోలీసులపై లోకేష్ సీరియస్ అయ్యారు.ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పోలీసులూ.. రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేస్తున్నారని అన్నారు. ఒక్కసారైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా మీకు కనిపించిందా? అని ప్రశ్నించారు. మీ ఎదురుగా సీఎం జగన్ (CM Jagan) ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదని నారా ప్రశ్నించారు. ‘అందులో ఏముంది? బ్రెజిల్ (Brezil) సరుకా? లిక్కర్లో మెక్కిన వేల కోట్లా? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా? ఏపీ సెక్రటేరియట్ (AP Secretariat) ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా? సమాధానం డీజీపీ చెబుతారా?’ అని నారా లోకేష్ నిలదీశారు.

అంతకు ముందు ఓ ట్వీట్‌లో.. ఇంటికి కిలో బంగారమిచ్చినా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఓటమి తప్పదని నారా లోకేష్ అన్నారు. అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం... జగన్‌ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో బంధించాలని నిర్ణయానికొచ్చారన్నారు. ఈ నేపథ్యంలో చీప్ ట్రిక్స్‌తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేణిగుంటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) చెందిన గోడౌన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పంపకానికి సిద్ధంగా ఉన్న చేతి గడియారాలు, స్పీకర్లు, విసనకర్రలతో పాటు మొత్తం 52 రకాల వస్తువుల డంప్‌ను అధికారులు పట్టుకున్నారని నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే వైసీపీ తాయిలాల డంప్‌నైతే పట్టుకున్నారన్నారు. మరి ఇసుక, లిక్కర్‌లో జగన్ దోచుకొని ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిన డబ్బుల డంప్‌‌ను ఎప్పుడు పట్టుకుంటారని లోకేష్ ప్రశ్నించారు.

Updated Date - Mar 29 , 2024 | 08:24 AM