Share News

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన

ABN , Publish Date - May 13 , 2024 | 12:47 PM

Andhrapradesh: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్‌లో బయలుదేరారు.

Visakhapatnam: మమ్మల్ని పట్టించుకోండి.. ట్రైన్లో విశాఖ ఓటర్ల ఆవేదన
Troubles of Visakha voters

విశాఖపట్నం, మే 13: ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు (AP Elections 2024) ఈసారి పెద్ద సంఖ్యలో ఓటర్లు (Voters) తరలివస్తున్నారు. ఎన్నికలు, పైగా వరుసగా సెలవులు రావడంతో తెలుగు ప్రజలు ఏపీ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ స్వంత గ్రామాలకు చేరుకోగా... చివరి గంటలో అయినా ఓటు హక్కు వినియోగించుకోవాలని భావించిన అనేక మంది ఈరోజు కూడా ఏపీకి పయనమయ్యారు. ఇదే విధంగా విశాఖకు చెందిన పలువురు ఓటర్లు ఓటు వేసేందుకు స్పెషల్ ట్రైన్‌లో బయలుదేరారు. నాగవళి - నాందేడ్ సూపర్ పాస్ట్ స్పెషల్ ట్రైన్లో విశాఖ ఓటర్లు వస్తున్నారు. అయితే ప్రయాణ సమయంలో వాళ్లు ఎదుర్కున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఉదయం 11 గంటల పోలింగ్ శాతమిదే.. ఆ రాష్ట్రంలో అత్యధికం


ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లి ఓటు వేయాలని భావించిన ఓటర్లకు కాస్త నిరాశే ఎదురవుతోంది. ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టేలా ట్రైన్‌ నడుస్తోంది. ఉదయం 6 గంటలకు చేరాల్సిన ట్రైన్‌ను రైల్వే శాఖ సుమారుగా 5 గంటలు ఆలస్యంగా నడుపుతోంది. ప్రతీచోట టెక్నికల్ సమస్య అంటూ ట్రైన్‌ను నిలిపివేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైలు ఆలస్యంపై అధికారులు సమాధానం చెప్పడం లేదని విశాఖ ఓటర్లు వాపోతున్నారు. తమ ఓటు వృధా ఆవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకుని, సకాలం గమ్యాన్ని చేర్చాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వీడియో సందేశం ద్వారా విశాఖ ఓటర్లు వినతి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Anantapur: అనంతపూర్ లోక్‌సభ స్థానం కోసం వీరి మధ్యనే పోటీ

AP Elections: రాప్తాడులో ఉద్రిక్తతల నడుమే పోలింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 12:54 PM