Share News

Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

ABN , Publish Date - May 10 , 2024 | 12:16 PM

ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు.

Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది

కాకినాడ: ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు. అందరి ఇళ్ళలో ఫ్యాన్లు ఉండడం వల్ల చల్లటి గాలి స్వీకరిస్తున్నామన్నారు. ఆ ఫ్యాను గుర్తే మన జగన్‌దని ముద్రగడ పేర్కొన్నారు. జగన్‌కి ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోతామన్నారు. ఆ తరువాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని ముద్రగడ లేఖలో తెలిపారు.

Supreme Court: తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం


నేతలందు.. ముద్రగడ వేరయా అనాల్సి వస్తుంది.. ఇలాంటివి చూస్తుంటే.. ఇలాంటి వారి కారణంగా ఎవరికి ప్రయోజనం ఉండదు.. ఏదో ఒక పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామన్న ఆనందం తప్ప. కనీసం ఆయన బయటకు వచ్చి ఏ పార్టీ కోసమూ ప్రచారం చేసింది ఇప్పటి వరకూ లేదు. ఇంట్లో కూర్చొని లేఖలు రాయడమో లేదంటే మీడియాను పిలిచి నాలుగు మాటలు మాట్లాడటమో చేస్తున్నారంతే. ఈ మాత్రానికే పవన్‌ను పిఠాపురంలో లేకుండా చేస్తాం.. డిపాజిట్లు రాకుండా చేస్తాం.. వంటి ప్రగల్భాలు. ఇంటిని వీడి గట్టిగా జనంలో పగలెనకా.. రాత్రెనకా తిరిగే వారికే దిక్కులేదు. ఇంట్లో కూర్చొని మాటలు చెబితే అవుతుందా? పైగా ముద్రగడను చూపించి వైసీపీ జబ్బలు చరుచుకోవడం మరింత ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి..

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!

AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 12:16 PM