AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..
ABN , Publish Date - May 13 , 2024 | 08:26 AM
ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
అమరావతి: ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు. ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీరెడ్డితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana: మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో 4గంటలకే ముగియనున్న పోలింగ్
ఎండాకాలం కావడంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పలు చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగుతోంది. కకొన్ని చోట్ల మాత్రం ఈవీఎంలు మొరాయిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే
Read Latest AP News And Telugu News