Share News

Congress: మురుగు నదిలో స్నానం చేసిన ఎంపీ అభ్యర్థి.. పెద్ద కారణమే

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:46 PM

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Congress: మురుగు నదిలో స్నానం చేసిన ఎంపీ అభ్యర్థి.. పెద్ద కారణమే

భోపాల్: ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన నదుల్లో షిప్రా ఒకటి. ఈ నదితో లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. తాగునీటిని కూడా అందిస్తున్నారు.

అయితే నదీ తీరంలో పరిశ్రమలు, పట్టణాలు వెలియడం.. అవి వెదజల్లే కలుషితాలను నదిలోకే వదిలేయడంతో నీరు దుర్గంధభరితంగా మారుతోంది. దీంతో ఆ నీరు ఎందుకు పనికి రాకుండా.. సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సమస్యపై అధికార బీజేపీకి ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ అంటోంది. ఈ క్రమంలో ఉజ్జయిని లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మహేశ్ పర్మార్.. ప్రభుత్వానికి వినూత్న రీతిలో నిరసన తెలియజేయాలి అనుకున్నారు. తొలుత కలుషిత నీరు వస్తున్న కాలువలో కూర్చున్నారు. అనంతరం నదిలోకి దిగి స్నానం చేసి.. ప్రభుత్వానికి నిరసనను తెలియజేశారు.


ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నదిని శుభ్రం చేయిస్తామని హామీ ఇస్తుందని.. తరువాత పట్టించుకోదని మహేశ్ ఆరోపించారు. షిప్రా నదిలోకి కలుషితాలు కలవకుండా అరికట్టాలని.. నది స్వచ్ఛతను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించారు. షిప్రా నది పరిశుభ్రత కోసం ఉజ్జయిని ప్రజలు పోరాడాలని మహేష్ కోరారు.‘‘గత 10 ఏళ్లుగా కేంద్రంలో, మధ్యప్రదేశ్‌లో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది. పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు నది కాలుష్యంపై ఎన్నిసార్లు వివరించినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అభివృద్ధి గురించి మాట్లాడే బీజేపీ ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏంటి’’ అని మహేశ్ పర్మార్ ప్రశ్నించారు.

Patna: పట్నాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 30కిపైగా..

ఉజ్జయిని బీజేపీ సిట్టింగ్ ఎంపీ అనిల్ ఫిరోజియాతో.. కాంగ్రెస్ అభ్యర్థి పర్మార్ తలపడనున్నారు. మధ్యప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. తదుపరి మూడు దశల ఓటింగ్ ఏప్రిల్ 26, మే 7, మే 13 తేదీల్లో జరుగుతాయి. మే 13న ఉజ్జయినిలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దిగువ సభకు పంపే సభ్యుల పరంగా ఇది ఆరో అతిపెద్ద రాష్ట్రం. వీటిలో 10 సీట్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ కాగా, మిగిలిన 19 అన్ రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 25 , 2024 | 05:47 PM