Share News

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!

ABN , Publish Date - May 16 , 2024 | 10:28 AM

Andhrapradesh: ప్రతీ ఏటా పండుగలా జరిగే మహానాడు కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల పలితాలే కారణం. ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

TDP Mahanadu: టీడీపీ మహానాడు వాయిదా.. రీజన్ ఇదే!
TDP Mahanadu

అమరావతి, మే 16: ప్రతీ ఏటా పండుగలా జరిగే టీడీపీ మహానాడు (TDP Mahanadu) కార్యక్రమానికి ఈసారి కాస్త బ్రేక్ పడింది. అందుకు ఎన్నికల పలితాలే కారణం. ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరగాల్సి ఉంది. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు, అందుకు ఏర్పాట్లు, అనంతరం ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) వెల్లడించారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌కు నివాళి, పార్టీ జెండాలు ఎగురవేయడం, రక్తదాన శిబిరాలు యధావిధిగా ఉంటాయని అధినేత చెప్పారు. తిరిగి ఎప్పుడు మహానాడు నిర్వహిచాలి?.. తేదీలపై మరోసారి ప్రకటన చేద్దామని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.

AP News: సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై సైలెన్స్


బాబు ఫైర్...

తాడిపత్రిలో టీడీపీ సానుభూతిపరులపై డీఎస్పీ చైతన్య (DSP Chaitanya_ చేసిన దాడిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అతను రాజంపేట నుంచి తాడిపత్రి ఎలా వచ్చారని బాబు ప్రశ్నించాు. డీఎస్పీ ఆగడాలు, దౌర్జన్యకాండపై ఎన్నికల కమిషన్‌కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీ వ్యవహార శైలిపై చంద్రబాబు, పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రెండు రోజులు ముందు డీబీటీకి నిధుల విడుదలపై హడావుడి చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. వృద్ధుల పెన్షన్లు విషయంలో సీఎస్‌ వ్యవహారశైలిని కూడా టీడీపీ నేతలు ప్రస్తావించారు. అన్ని గుర్తు ఉంటాయంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

AP News: రెచ్చిపోతున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు

Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. డివైడర్‌, ట్రావెల్స్ బస్‌లను ఢీకొట్టి.. ఆపై..

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 11:39 AM