Share News

EVMs: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

ABN , Publish Date - May 14 , 2024 | 06:56 AM

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు.

EVMs: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు (EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు. ఈ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ (Sampath Kumar) పరిశీలిస్తున్నారు. తిరువూరు, నందిగామ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నారు.


మైలవరం నియోజకవర్గం ఈవీఎంలను నిమ్రా మెడికల్ కాలేజీకి తరలిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు. విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గం ఈవీఎంలను ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఏడు నియోజకవర్గ ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నామని రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు.


కాగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం సోమవారం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. పలు నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య గట్టి పోటీ కొనసాగింది. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

ఈసారి ఊహించని ఫలితాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 06:58 AM