ఇదెక్కడి చోద్యం.. ట్యూషన్‌కి వచ్చిన యువతిని భర్త వద్దకు తీసుకెళ్లిన భార్య.. తనకు ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సిందే అంటూ..

ABN , First Publish Date - 2022-10-15T23:56:51+05:30 IST

అతడికి 24 సంవత్సరాలు. తనకంటే వయసులో పదేళ్లు పెద్దదైన మామ కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఆమెతో సంతోషంగా..

ఇదెక్కడి చోద్యం.. ట్యూషన్‌కి వచ్చిన యువతిని భర్త వద్దకు తీసుకెళ్లిన భార్య.. తనకు ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సిందే అంటూ..

అతడికి 24 సంవత్సరాలు. తనకంటే వయసులో పదేళ్లు పెద్దదైన మామ కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా ఆమెతో సంతోషంగా జీవించేవాడు. అయితే భార్య మాత్రం అంతా అవాక్కయ్యేలా వ్యవహరించింది. తన ఇంటికి ట్యూషన్‌కి వచ్చే యువతిని తన భర్త వద్దకు రావాలంటూ తీసుకెళ్లింది. రెండో పెళ్లి చేసుకోవాలని కోరింది. భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమె చేసిన పని.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


పాకిస్థాన్ లాహోర్‌కు (Pakistan Lahore) చెందిన సయ్యద్ మజర్ అనే 24ఏళ్ల యువకుడి గురించి సోషల్ మీడియాలో (Social media) ఆసక్తిగా చర్చింకుంటున్నారు. ఇతను కొన్ని నెలల కిందట తనకంటే పదేళ్లు పెద్దదైన తన మామ కూతురు ఆమ్మా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో 17ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయినా మజర్, ఆమ్నా ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. అయితే ఆమ్నాకు వివాహమైనప్పటి నుంచి అసంతృప్తి ఉండేది. తన భర్త కారణంగా పిల్లలు కలగడం లేదని బాధపడుతూ ఉండేది. అయితే మజర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. రెండో పెళ్లి (Second marriage) చేసుకోమని చెబుతున్నా మజర్ మాత్రం వద్దని చెప్పేవాడు.

తమ కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి టీచరే కారణమంటూ ఆరోపణ.. అసలు క్లాస్ రూమ్‌లో ఏం జరిగిందంటే..


అయితే ఎలాగైనా తన భర్తకు రెండో పెళ్లి చేయాలని ఆమ్నా ఆలోచిస్తూ ఉండేది. ఆమె వద్దకు కొంతమంది యువతులు ట్యాషన్‌కు వచ్చేవారు. వారిలో ఓ అందమైన యువతిని తన భర్తకు ఇచ్చి పెళ్లి చేయాలని భావించింది. ఓ రోజు 18 ఏళ్ల యువతిని తన భర్త వద్దకు తీసుకెళ్లింది. నా భర్తను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా.. అని ఆమెను అడిగింది. ఆమె ఓకే చెప్పినా మజర్ మాత్రం మొదట అంగీకరించలేదు. అయితే భార్య బలవంతం చేయడంతో చివరకు ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం యువతికి కుమార్తె జన్మించింది. తాజాగా ఓ య్యూటూబ్ చానెళ్లు (YouTube channel) వారు మజర్ కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తన భర్తకు ఇష్టమైతే మూడో వివాహం కూడా చేసుకోవచ్చు.. అని మొదటి భార్య చెప్పడంపై నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఓ వైపు భార్య, మరోవైపు మేనత్త.. ఒకరికొకరికి తెలీకుండా వ్యవహారం.. చివరకు ఓ రోజు పొలం పనికని వెళ్లి..



Updated Date - 2022-10-15T23:56:51+05:30 IST