తమ కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి టీచరే కారణమంటూ ఆరోపణ.. అసలు క్లాస్ రూమ్‌లో ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-15T21:22:27+05:30 IST

బాలికలు, యువతులకు బయటే కాకుండా బడులు, కళాశాలల్లో కూడా అప్పుడప్పుడూ అవమానాలు ఎదురవుతుంటాయి. బయట జులాయిలతో వేధింపులు, తరగతి గదుల్లో టీచర్లతో..

తమ కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి టీచరే కారణమంటూ ఆరోపణ.. అసలు క్లాస్ రూమ్‌లో ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

బాలికలు, యువతులకు బయటే కాకుండా బడులు, కళాశాలల్లో కూడా అప్పుడప్పుడూ అవమానాలు ఎదురవుతుంటాయి. బయట జులాయిలతో వేధింపులు, తరగతి గదుల్లో టీచర్లతో ఇబ్బందులు.. వెరసి ఒక్కోసారి బాధితులు ఆత్మహత్యలకు పాల్పడే విషాద ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఎంతవరకు నిజమో.. ఎంతవరకు అబద్ధమో తెలీదు గానీ.. జార్ఖండ్‌లో ఓ బాలిక విషయంలో ఇలాంటి ఘటనే జరిగింది. పాఠశాల నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చిన బాలిక.. షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ కూతురు పరిస్థితి ఇలా అవడానికి కారణం.. టీచరే అంటూ తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. అసలు పాఠశాల తరగతి గదిలో ఏం జరిగిందంటే..


బాధితులు, పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ (Jharkhand) జంషెడ్‌పూర్ పరిధి ఛాయనగర్ పరిధికి చెందిన బాలిక.. స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇలావుండగా, ఇటీవల విద్యార్థులకు పరీక్షలు (Exams) నిర్వహిస్తున్నారు. బాధిత బాలిక కూడా శుక్రవారం పరీక్షలకు హాజరైంది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. విద్యార్థిని కాపీ కొడుతోందనే కారణంతో టీచర్.. బాలికను తిట్టడంతో పాటూ అందరి ముందూ దుస్తులు విప్పించింది. దీంతో తీవ్ర అవమానంగా భావించిన బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు ఎందుకు అలా ఉన్నావని అడిగినా ఏ సమాధానమూ చెప్పకుండా గదిలోకి వెళ్లి.. తలుపులు వేసుకుంది. అనంతరం కిరోసిన్ పోసుకుని (Girl suicide attempt) నిప్పంటించుకుంది.

భార్య ప్రియుడిని ఇంటికి పిలిపించిన భర్త.. ఏంటీ పని.. అని అంతా వారిస్తున్నా వినకుండా..


గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులు కంగారుపడి.. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. లోపల మంటల్లో కాలిపోతున్న కూతురిని చూసి బోరున విలపించారు. స్థానికుల సహకారంతో వెంటనే మంటలు ఆర్పేసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శరీరం సుమారు 80శాతం కాలిపోవడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తమ కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి టీచరే కారణమంటూ బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. దీనిపై పాఠశాల హెడ్‌మాస్టర్ మాట్లాడుతూ.. బాలిక కాపీ కొట్టడంతో టీచర్ తిట్టిన మాట వాస్తవమేనని, అయితే విద్యార్థిని దుస్తులు విప్పించిన విషయం గురించి తమ వద్ద ఆధారాలు లేవని చెప్పారు. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: పగబట్టిన పాము వెంటబడుతోందని పరుగులు పెట్టాడు.. తీరా చివరకు గమనిస్తే..



Updated Date - 2022-10-15T21:22:27+05:30 IST