Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2022-08-16T21:36:15+05:30 IST

ఓ వైపు జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. మరో వైపు జోరు వర్షం. తన పిల్లలు ఎక్కడ తడుస్తుంటారో అని ఆ తల్లి.. ఇంట్లో ఒకటే కంగారుపడుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారో అని పదే పదే..

Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా..
ప్రతీకాత్మక చిత్రం

ఓ వైపు జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. మరో వైపు జోరు వర్షం. తన పిల్లలు ఎక్కడ తడుస్తుంటారో అని ఆ తల్లి.. ఇంట్లో ఒకటే కంగారుపడుతూ ఉంది. పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారో అని పదే పదే ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో బయటికి వెళ్లి చూడాలనే ఉద్దేశంతో తలుపులు తీసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులంతా షాక్ అయ్యారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..


ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్‌పూర్‌ (BisalPoor) పరిధి రతన్‌పూర్‌లోని జునాషహర్ వార్డు నంబర్ 15లో సరితా అగర్వాల్ అనే మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. భర్త అజయ్‌ అగర్వాల్‌తో మనస్పర్థల కారణంగా ఐదేళ్లుగా ఆమె పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఇదిలావుండగా, స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఆగస్టు 15న స్థానిక పాఠశాలలో వేడుకలు (Celebrations) నిర్వహించారు. దీంతో సరితా అగర్వాల్ పిల్లలు పొద్దునే పాఠశాలకు వెళ్లారు. అయితే కాసేపటికి భారీ వర్షం (heavy rain) మొదలైంది. ఆ సమయంలో సరితా అగర్వాల్ ఒక్కటే ఇంట్లో ఉంది.

school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..


వర్షంలో తన పిల్లలు ఎలా ఇంటికి వస్తారో, ఎక్కడ తడుస్తారో.. అని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో పిల్లలు వస్తున్నారో, లేదో అని చూసేందుకు.. బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. తలుపులను తీయగానే ఒక్కసారిగా విద్యుదాఘాతానికి (electric shock) గురైంది. దీంతో చాలా సేపు తలుపులకు అతుక్కుని అలాగే ఉండిపోయింది. స్థానికులు గమనించి, ఆమె సోదరుడికి సమాచారం అందించారు. కంగారుగా అక్కడికి చేరుకున్న అతను.. పవర్ ఆఫ్ చేశాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందింది. దీంతో స్థానికులంతా అయ్యో పాపం.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం..


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ వైరు తెగిపోయిన విషయం గమనించని మహిళ.. ఇనుప తలుపులను తాకడంతో ఈ ఘటన చోటుచేసున్నట్లు గుర్తించారు. ఇదిలావుండగా, సర్కండ అనే ప్రాంతలో నివాసం ఉంటున్న తివారీ అనే విద్యార్థి కూడా గోడను తాకడంతో విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Power short circuit) అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాగే ఇనుప స్తంభాలను, గోడలను తాకొద్దని అధికారులు సూచించారు.

Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..



Updated Date - 2022-08-16T21:36:15+05:30 IST