school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..

ABN , First Publish Date - 2022-08-11T14:05:15+05:30 IST

ఆమె ఓ ఉపాధ్యాయురాలు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సింది పోయి.. తానే దారి తప్పింది. స్కూల్ మేనేజర్‌ను టార్గెట్ చేసిన ఆమె.. ఓ రోజు..

school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..
ప్రతీకాత్మక చిత్రం

ఆమె ఓ ఉపాధ్యాయురాలు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సక్రమమైన మార్గంలో నడిపించాల్సింది పోయి.. తానే దారి తప్పింది. స్కూల్ మేనేజర్‌ను టార్గెట్ చేసిన ఆమె.. ఓ రోజు ఏకంగా హోటల్ గదికి రమ్మని చెప్పింది. తర్వాత ఇంటికి వెళ్లిన అతను.. మరసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో షాక్ అయ్యాడు. కొందరు నేరస్థులతో కలిసి ఆమె చేసిన నిర్వాకంతో చివరకు జైల్లో ఊచలు లెక్కెడుతోంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం షాజహాన్‌పూర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వీరేష్ శర్మ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ స్కూల్లో మేనేజర్‌గా (Private School Manager) పని చేస్తున్నాడు. అదే స్కూల్లో ఓ మహిళ.. ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఒకే స్కూల్ కావడంతో ఇద్దరూ రోజూ చనువుగా మాట్లాడుకునే వారు. అయితే ఉపాధ్యాయురాలు మాత్రం అతడిపై మనుసులో కుట్రపూరితంగా ఆలోచించడం మొదలెట్టింది. ఈ క్రమంలో జూన్ 21న రాత్రి హోటల్ గది నుంచి వీరేష్ శర్మకు ఫోన్ చేసి పిలిపించుకుంది. అక్కడికి వెళ్లిన వీరేష్ శర్మతో రాసలీలలు సాగించింది. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన అతడికి.. మరుసటి రోజు ఫోన్ కాల్ వచ్చింది. అర్జెంట్‌గా రూ.6లక్షలు పంపకపోతే హోటల్లో గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు.

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్నానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..


తర్వాత అతడి వాట్సాప్‌కు వచ్చిన వీడియోలో తాను అర్ధనగ్నంగా ఉండడం చూసి అవాక్కయ్యాడు. అప్పటికప్పుడు లక్ష రూపాయలు (One lakh rupees) సమర్పించుకున్నాడు. తర్వాత మిగతా డబ్బుల కోసం రోజూ వేధించేవారు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగస్టు 2న అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత వీరేశ్ శర్మ కొడుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన తండ్రిపై జరిగిన కుట్ర కోణాన్ని బయటపెట్టాడు. విచారణ చేసిన పోలీసులు.. ఆగస్టు 9న ఉపాధ్యాయురాలితో సహా మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15,000నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..



Updated Date - 2022-08-11T14:05:15+05:30 IST