Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 11 Aug 2022 10:23:48 IST

Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..

twitter-iconwatsapp-iconfb-icon
Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..

పెళ్లి సంబంధాల (Marital relations) కోసం.. సాధారణంగా బంధువుల ద్వారా విచారించడమో లేక మధ్యవర్తులను ఆశ్రయించడమో చేస్తుంటారు. ఇటీవల మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల (Matrimony websites) ద్వారా పెళ్లి సంబంధాలు చూడడం అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు కొందరు తమ కుమార్తెలకు వివాహం చేసేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సరైన సంబంధాలు రాకపోవడం, వచ్చినా అధిక కట్నాలు డిమాండ్ చేయడం తదితర కారణాలతో పెళ్లిళ్లు చేయడం కష్టమవుతుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతంలో ఇలాంటి సమస్యలు ఏవీ లేవు. అక్కడ తొమ్మిది రోజుల పాటు పెళ్లికొడుకుల సంత జరుగుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి తమకు అనువైన సంబంధాలను చూసుకోవచ్చు. వింతగా ఉన్న ఈ పెళ్లికొడుకుల మార్కెట్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహర్ (Bihar) రాష్ట్రం మధుబని జిల్లాలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 700సంవత్సరాల నుంచి వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. పెళ్లి వయసుకు వచ్చిన యువకులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి, ఓ చెట్టు కింద వరుసగా కూర్చుంటారు. వధువు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటారు. ముందుగా పెళ్లి కుమారులందరినీ చూసిన తర్వాత, ఇష్టమైన వారిని వధువు సెలెక్ట్ చేయగానే.. మిగతా విషయాలు పెద్దలు మాట్లాడుకుంటారు. వివాహం ఖాయం చేసుకునే ముందు.. వధూవరుల జనన ధ్రవీకరణ పత్రాలు (Birth certificate), విద్యార్హత తదితర అంశాలపై చర్చించుకుంటారు.

love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన..

ఈ తంతు పూర్తవగానే మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అప్పట్లో రాజా హరి సింగ్ అనే వ్యక్తి ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారని చెబుతున్నారు. వివాహాల కారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ పద్ధతిని ప్రవేశ పెట్టారట. అలాగే కట్నాలు (dowries) తీసుకోవడం కూడా ఇక్కడ నిషేధం. అయితే ఇటీవల చాలా మంది అనధికారికంగా కట్నాలు తీసుకోవడం సాధారణమైందని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి ఈ పెళ్లికొడుకుల సంత.. సోషల్ మీడియాలో ఇటీవల హాట్‌టాపిక్‌గా మారింది.

school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం.. Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో... videoAtrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ.. Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.