dead body controversy: మంటల్లోంచి మృతదేహం వెలికితీత.. 20గంటల పాటు ట్రాఫిక్ జామ్.. చివరకు జరిగింది ఇదీ..

ABN , First Publish Date - 2022-07-29T21:11:49+05:30 IST

24ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి (dead body) అంత్యక్రియలు (funeral)..

dead body controversy: మంటల్లోంచి మృతదేహం వెలికితీత.. 20గంటల పాటు ట్రాఫిక్ జామ్.. చివరకు జరిగింది ఇదీ..

24ఏళ్ల యువకుడు ఉన్నట్టుండి చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం మృతదేహానికి (dead body) అంత్యక్రియలు (funeral) నిర్వహించేందుకు ఏర్పట్లు చేశారు. అంతా కలిసి శ్మశానవాటిక (Graveyard) లో దహనక్రియలు నిర్వహించారు. అయితే తర్వాత అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కొందరు అక్కడికి చేరుకుని మంటలపై నీళ్లు పోసి, మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ఘటనతో అక్కడ సుమారు 20గంటల పాటు ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఘటనా స్థలంలో పోలీసు బలగాల (Police forces) ను మోహరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం జాంజ్‌గిర్-చంపా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బరద్వార్ బస్తీకి చెందిన భయ్యాలాల్ పాట్లే కుమారుడు ప్రదీప్ పాట్లే (24) అనే యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం (Postmortem) అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబసభ్యులు, బంధువులంతా కలిసి వారి సొసైటీకి చెందిన శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే వర్షం కారణంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కాలేదు. దీంతో గ్రామ సమీపంలో చెరువులో ఉన్న మరో సోసైటీకి చెందిన శ్మశనవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..


దహనక్రియలు జరుగుతుండగా శ్మశానవాటికకు సంబంధించిన సొసైటీ ప్రజలు కొందరు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మంటలపై నీరు పోసి ఆర్పేశారు. మృతదేహాన్ని బలవంతంగా బయటకు లాగి, కాళ్లతో తన్నుతూ అమానవీయంగా ప్రవర్తించారు. దీంతో రెండు సొసైటీ గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. చివరకు మృతదేహాన్ని బరద్వార్-జైజైపూర్ ప్రధాన రహదారిపై ఉంచి ధర్నా చేశారు. దీంతో సుమారు 20గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసు బలగాలను మోహరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. సర్పంచ్ జగదీష్ ఓరాన్ సహా 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు, అధికారుల ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Haryana woman shocking decision: కలిసిపోయిందిలే అనుకున్న కోడలు.. చివరకు ఎంత పని చేసింది.. చెత్త వేసి రమ్మని అత్తకు చెప్పి..



Updated Date - 2022-07-29T21:11:49+05:30 IST