500మీటర్ల దూరం వరకూ.. యువతిని ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్.. ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో.. చివరకు..

ABN , First Publish Date - 2022-10-16T23:34:30+05:30 IST

ఒంటరిగా ఒకరిని నమ్మి వెళ్లే యువతులు.. క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు లేని రోజులివి. ఇక ముక్కు, మొఖం తెలీని వారిని నమ్మితే ఇక అంతే సంగతులు. పైకి మంచిగా కనిపిస్తున్నారని..

500మీటర్ల దూరం వరకూ.. యువతిని ఆటోలో తీసుకెళ్లిన డ్రైవర్.. ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో.. చివరకు..

ఒంటరిగా ఒకరిని నమ్మి వెళ్లే యువతులు.. క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు లేని రోజులివి. ఇక ముక్కు, మొఖం తెలీని వారిని నమ్మితే ఇక అంతే సంగతులు. పైకి మంచిగా కనిపిస్తున్నారని కొందరు మహిళలు చెప్పినట్లు వింటుంటారు. అయితే తీరా సమయం రాగానే వారిలోని శాడిస్టు నిద్రలేస్తుంటాడు. ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. మహారాష్ట్రలో దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది. ఒంటరిగా ఉన్న యువతిని (young woman) ఆటో ఎక్కించుకున్నాడు. 500మీటర్ల దూరం వరకూ లాక్కెళ్లాడు. పోలీసులకు దొరక్కుండా ఎలాంటి ఆధారాలు లేకుండా చూసుకున్నాడు. అయితే చివరకు ఏం జరిగిందంటే..


మహారాష్ట్ర (Maharashtra) థానేలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతి.. రోజూ మాదిరే శుక్రవారం కూడా కళాశాలకు వెళ్లేందుకు బయలుదేరింది. బస్సు కోసం ఎదురు చూసినా ఎంత సేపూ రాలేదు. అదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఆమెను గమనించాడు. ఎలాగైనా అనుభవించాలని కుట్రపన్నాడు. ఆమె వద్దకు వెళ్లి ఆటో ఆపాడు. తాను దింపుతానంటూ చెప్పినా యువతి మాత్రం ఎక్కలేదు. చేయి పట్టుకుని బలవంతంగా 500మీటర్ల మేర లాక్కెళ్లాడు. చివరకు ఎలాగోలా అతడి నుంచి విడిపించుకుని.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది.

ఓ వైపు భార్య, మరోవైపు మేనత్త.. ఒకరికొకరికి తెలీకుండా వ్యవహారం.. చివరకు ఓ రోజు పొలం పనికని వెళ్లి..


అయితే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఆటో నంబర్ కనిపించకుండా డ్రైవర్ జాగ్రత్త పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. అయితే ఆటో నంబర్ కనిపించకపోవడంతో పట్టుకోవడం కష్టమైంది. అయితే ఆటో డ్రైవర్ పొడవాటి జుట్టు వీడియోలో కనిపించింది. అలాగే ఆటో వెనుక భాగంలో ఉన్న గుర్తు ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆటో డ్రైవర్.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజోలు ప్రాంతానికి చెందిన రాజు అని తెలిసింది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదెక్కడి చోద్యం.. ట్యూషన్‌కి వచ్చిన యువతిని భర్త వద్దకు తీసుకెళ్లిన భార్య.. తనకు ఇష్టం లేకున్నా ఒప్పుకోవాల్సిందే అంటూ..



Updated Date - 2022-10-16T23:34:30+05:30 IST