rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..

ABN , First Publish Date - 2022-07-31T23:13:24+05:30 IST

నిజంగా ఇది కనీవినీ ఎరుగని వింత ఘటనే. 30ఏళ్ల తర్వాత ఊరికొచ్చిన అతను.. కనీసం భార్య కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అప్పటి వరకూ చనిపోయాడనుకున్న గ్రామస్తులు..

rare marriage: పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తించడంతో.. 30 ఏళ్ల తర్వాత వివాహం.. కలా లేక నిజమా! అంటున్న గ్రామస్తులు..

నిజంగా ఇది కనీవినీ ఎరుగని వింత ఘటనే. 30ఏళ్ల తర్వాత ఊరికొచ్చిన అతను.. కనీసం భార్య కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అప్పటి వరకూ చనిపోయాడనుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా అతన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరకు పుట్టుమచ్చను చూసి భర్తను గుర్తుపట్టడంతో గ్రామస్తుల సమక్షంలో దంపతులకు ఘనంగా వివాహం (marriage) చేశారు. ఇన్నాళ్లూ.. కొడుకును తమ కోడలే చంపేసి ఉంటుందనుకున్న అత్తమామల అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం బక్సర్ పరిధి కొరంసరై గ్రామానికి చెందిన  ఘన్‌శ్యామ్ తేలికి 30ఏళ్ల క్రితం మున్నీ దేవి అనే మహిళతో వివాహమైంది. కొన్ని నెలల అనంతరం వారికి ఓ కొడుకు పుట్టాడు. ఇదిలావుండగా, ఓ రోజు ఘన్‌శ్యామ్ పని మీద బక్సర్‌కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో బస్టాండ్ నుంచి సడన్‌గా అదృశ్యమయ్యాడు. రాత్రికి కూడా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కంగారుపడింది. మరుసటి రోజు వస్తాడులే అనుకుంది. కానీ రోజులు గడుస్తున్నా భర్త మాత్రం ఇంటికి రాలేదు. దీంతో మున్నీదేవితో పాటూ ఆమె అత్తమామలు తెలిసిన ప్రాంతాల్లో విచారించారు. అయినా అతడి ఆచూకీ లభించలేదు.

Girl selfie video: నా వయసు 17ఏళ్లు.. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మకు చెప్పినా పట్టించుకోలేదు.. పైగా.. అంటూ ఓ బాలిక చెప్పింది విని..


ఇలా సుమారు ఐదేళ్ల పాటు అతడి కోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా ఘన్‌శ్యామ్ జాడ తెలియలేదు. దీంతో అతడు చనిపోయాడనుకుని అంత్యక్రియలు (funeral) కూడా నిర్వహించారు. అనంతర కాలంలో మున్నీదేవికి రెండో వివాహం (Second marriage) చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. అయితే ఇందుకు ఆమె అంగీకరించలేదు. భర్త తప్పిపోయిన సమయంలో ఆమె కడుపుతో ఉంది. తర్వాత ఆమెకు కొడుకు జన్మించాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ భర్త కోసం ఎదురుచూస్తూనే గడిపింది. ఇలా చూస్తుండగానే 30ఏళ్లు గడిచిపోయాయి. భర్తను మున్నీ దేవే చంపించి ఉంటుందని అత్తమామలు అనుకున్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆమె ఓపిగ్గా భరించింది. ఈ క్రమంలో అనుకోకుండా జూలై 15న ఘనశ్యామ్ సొంతూరికి చేరుకున్నాడు.

student love: మధ్యాహ్న సమయంలోనూ తలుపులు మూసిన విద్యార్థి.. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా..


మున్నీదేవికి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ భర్త మా వద్ద ఉన్నాడు.. వచ్చి తీసుకెళ్లండి’’.. అని చెప్పడంతో మున్నీ దేవి కొడుకు, మరికొందరు అక్కడికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి వీడియో కాల్ చేయగా.. మున్నీ దేవి తన భర్తను గుర్తించలేకపోయింది. తర్వాత అతడి ఎడమ తొడ మీద పుట్టుమచ్చను చూసి గుర్తుపట్టింది. దీంతో అతన్ని గ్రామానికి తీసుకొచ్చి.. బంధువులు, గ్రామస్తుల మధ్య మళ్లీ ఘనంగా వివాహం చేశారు. అయితే మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నాననే విషయాన్ని ఘన్‌శ్యామ్ చెప్పలేకపోతున్నాడు. గ్రామస్తులు మాత్రం.. ఇది కలా లేక నిజమా అనే భ్రమలోనే ఉన్నారు. మొత్తానికి 30ఏళ్ల తర్వాత దంపతులు మళ్లీ కలవడంతో అంతా సంతోషించారు. ఈ ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

husband attacked wife: ఆటోలో అత్తగారి ఇంటికి వచ్చిన కోడలు.. మరుక్షణమే డ్రైవర్‌తో సహా యువతిని చెట్టుకు కట్టేసిన వైనం.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..



Updated Date - 2022-07-31T23:13:24+05:30 IST