Girls Videos: యువకుడి ఫోన్లో పది మంది యువతుల అసభ్యకర వీడియోలు.. చివరకు అతడు చేసే పనేంటో తెలుసుకుని షాకైన పోలీసులు..

ABN , First Publish Date - 2022-08-06T02:44:00+05:30 IST

ఇటీవల ఎక్కువ శాంతం నేరాలు.. బాలికలు (girls), యువతులు (young women), మహిళల విషయంలోనే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రోజూ ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తోంది...

Girls Videos: యువకుడి ఫోన్లో పది మంది యువతుల అసభ్యకర వీడియోలు.. చివరకు అతడు చేసే పనేంటో తెలుసుకుని షాకైన పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ఎక్కువ శాంతం నేరాలు.. బాలికలు (girls), యువతులు (young women), మహిళల విషయంలోనే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రోజూ ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తోంది. కొందరు శాడిస్టులు యువతులను నమ్మించి మోసం చేస్తుంటే.. మరికొందరు ఫొటోలు, వీడియోలను చూపించి బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తున్నారు. వీడియోలను చూపిస్తూ బాధితులను మరింత చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇటీవల బీహార్‌లో (Bihar) ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ఫోన్లో సుమారు పది మంది యువతుల అసభ్యకర వీడియోలు (Girls Videos) బయటపడ్డాయి. చివరకు అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాజధాని పాట్నా (Patna) పరిధి పాటలీపురా ప్రాంతానికి చెందిన రాహుల్‌ కుమార్‌.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తుంటాడు. ఇతడు ఆస్పత్రిలోని పనుల కంటే సోషల్ మీడియాకే సమయం ఎక్కువ కేటాయించేవాడు. యువతులను పరిచయం చేసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు (Friend request) పంపేవాడు. కొన్నాళ్లకు ఇతడికి సుమారు పది మంది యువతులు పరిచయమయ్యారు. వారిలో నిత్యం చాటింగ్ చేస్తూ బాగా నమ్మించాడు. కొన్నాళ్లకు వారితో వీడియో కాల్ (video call) చేసి, నగ్నంగా మాట్లాడమని ప్రేరేపించేవాడు.

young woman Kidnapped: ప్లీజ్ వద్దంటూ వేడుకుంటున్నా.. వినిపించుకోని యువకులు.. ఇంట్లోకి వచ్చి యువతిని బలవంతంగా..


ఇలా మాట్లాడిన వీడియోలను రికార్డు చేసుకున్న తర్వాత.. తన అసలు స్వరూపం బయటపెట్టేవాడు.. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని, లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తానని బెదిరించేవాడు. ఇలా చాలా మంది యువతులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల ఓ యువతి ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్లో పరిశీలించగా.. చాలా మంది యువతుల అశ్లీల వీడియోలు (Indecent videos) బయటపడ్డాయి. ఇదిలావుండగా, పరువు పోతుందనే ఉద్దేశంతో బాధితులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధంగా లేకపోవడంతో యువకుడిపై కేసు ఫైల్ చేయలేదని సమాచారం. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Live in relationship: సహజీవనం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారి.. నాలుగు నెలల తర్వాత.. సడన్‌గా ఊహించని పరిణామం..



Updated Date - 2022-08-06T02:44:00+05:30 IST