young woman Kidnapped: ప్లీజ్ వద్దంటూ వేడుకుంటున్నా.. వినిపించుకోని యువకులు.. ఇంట్లోకి వచ్చి యువతిని బలవంతంగా..

ABN , First Publish Date - 2022-08-05T02:41:23+05:30 IST

మహిళల (women) విషయంలో కొందరు శాడిస్టులు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాగైనా తమదారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మాట వినని...

young woman Kidnapped: ప్లీజ్ వద్దంటూ వేడుకుంటున్నా.. వినిపించుకోని యువకులు.. ఇంట్లోకి వచ్చి యువతిని బలవంతంగా..

మహిళల (women) విషయంలో కొందరు శాడిస్టులు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఎలాగైనా తమదారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మాట వినని వారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా, తమిళనాడులో ఓ యువతి విషయంలో కొందరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. ప్లీజ్ వద్దంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా.. వినిపించుకోని వారు ఏకంగా ఇంట్లోకి వచ్చి యువతిని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..


తమిళనాడులోని (Tamil Nadu) మైలాడుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరన్ అనే వ్యక్తికి ఓ యువతికి వివాహం చేసేందుకు కొన్ని నెలల కిందట ఇరువైపు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. ఇందుకుగాను యువకుడు.. యువతి కుటుంబ సభ్యులకు కొంత నగదును కూడా ఇచ్చాడు. అయితే తర్వాత వారికి ఈ వివాహ నచ్చకపోవడంతో ఇష్టం లేదని చెప్పారు. అయితే యువకుడు మాత్రం ఎలాగైనా తనకు ఇచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేసేవాడు. ఈ క్రమంలో జూలై 12 పట్ట పగలు ఇంట్లోకి చొరబడి, యువతిని ఎత్తుకెళ్లేందుకు (Kidnapping) ప్రయత్నించాడు.

Snake in Shiva temple: శివాలయంలో పూజలు చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. శివలింగంపైకి వెళ్లడంతో..


అయితే యువతి తల్లి, సోదరుడు అడ్డుకోవడంతో వెనుదిరిగి వెళ్లాడు. అప్పటి నుంచి యువతిని ఎత్తుకెళ్లేందుకు వివిధ రకాల పథకాలు రూపొందించాడు. చివరకు ఆగస్టు 3న కొంతమంది యువకులను వెంటబెట్టుకుని రాత్రి వేళ.. యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. కుటుంబ సభ్యులు ఎంత వేడుకుంటున్నా వినకుండా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. టోల్ ప్లాజా వద్ద కారును ఆపిన పోలీసులు.. బాలికను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఎత్తుకెళ్తున్న ఘటన మొత్తం సీసీ కెమెరాలో (CC camera) రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral) అవుతోంది.

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..







Updated Date - 2022-08-05T02:41:23+05:30 IST