Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 04 Aug 2022 18:53:45 IST

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon
ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..

ప్రతి మధ్య తరగతి కుటుంబంలో (Middle class families) చాలా మందికి కారు కొనాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థికంగా అది సాధ్యపడదు. కారు కొనాలనే కోరికతో ఎన్నో ఏళ్ల నుంచి డబ్బులు సేవ్ వచ్చినా.. మధ్య మధ్యలో తలెత్తే సమస్య వల్ల సేవింగ్స్‌ను ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ప్రతి ఒక్క మిడిల్‌ క్లాస్‌ కుటుంబంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. అందుకే చాలా మంది తమ కోరికలు చంపుకొని.. కష్టమైనా టూ వీలర్‌ మీదే ముగ్గురు, ఒక్కోసారి నలుగురు కూడా ప్రయాణిస్తుంటారు.. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కలను సాకారం చేసుకున్నాడు. దాదాపు దశాబ్దం పాటు డబ్బులను సేవింగ్ చేస్తూ.. చివరికి తన డ్రీమ్‌ కారును కొనుగోలు చేశాడు. చివరకు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అభినందనలను అందుకున్నాడు.

తమిళనాడులోని (Tamil Nadu) కావేరిపట్టణంలోని కృష్ణగిరికి చెందిన అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి ఒక రైతు. ఓ వైపు వ్యవసాయ పనులను చేస్తూనే.. ఫోన్‌ షోరూమ్‌ నడుపుతున్నాడు. తనకు ఎప్పటికైనా కారు కొనాలనే కోరిక ఉండేది. దీంతో రోజూ కొంత డబ్బును సేవ్‌ చేసుకుంటూ వచ్చాడు. అలా పదేళ్లు కష్టపడి మహీంద్రాకు చెందిన న్యూ మోడల్.. మహీంద్ర XUV 700 కారును కొనుగోలు చేశాడు. ఈ ఆనందాన్ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రాతో షేర్‌ చేసుకున్నాడు. ‘‘సార్‌.. పదేళ్లు ఎంతో కష్టపడి సేవ్‌ చేసుకున్న డబ్బులతో కొత్తకారు కొన్నాను. మీ ఆశీర్వాదం కావాలి’’ అంటూ ట్వీట్ చేశాడు అశోక్‌ కుమార్.

Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..

ఈ ట్వీట్‌పై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘థ్యాంక్యూ.. నిజానికి మా కంపెనీ కారు ఎంచుకుని.. మమ్మల్ని ఆశీర్వదించింది మీరే. కష్టపడి సాధించిన మీ విజయానికి అభినందనలు.. హ్యాప్పీ మోటరింగ్’’.. అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అశోక్‌ కుమార్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై.. ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు సైతం అశోక్‌ కుమార్‌‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Instagram friendship: ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన పైలట్.. ఏకంగా 30మంది మహిళలతో.. చివరకు తెలిసింది ఏంటంటే..ఇవి కూడా చదవండిLatest News in Telugu

Innovative Stunt: కారు నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఇతడి స్టంట్ చూస్తే.. షాకవకుండా ఉండలేరు.. videoTragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..videoyoung man cheated the girl: అమ్మాయి పేరుతో యువతికి దగ్గరైన యువకుడు.. ఓ రోజు నేరుగా ఆమె వద్దకు వెళ్లి దుస్తులు చించుకుని.. చివరకు..Tamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..attack on daughter in law: కోడలు, ఆమె సోదరిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చిన మామ.. అంతా చూస్తుండగా.. కారణం ఏంటని విచారిస్తే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.