Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 05 Aug 2022 20:17:26 IST

Girls Robbery: దుకాణంలోకి మూకుమ్మడిగా చొరబడిన యువతులు.. ఇంతకీ వారు చోరీ చేసిన వస్తువులేంటో తెలిస్తే అవాక్కవుతారు..

twitter-iconwatsapp-iconfb-icon
Girls Robbery: దుకాణంలోకి మూకుమ్మడిగా చొరబడిన యువతులు.. ఇంతకీ వారు చోరీ చేసిన వస్తువులేంటో తెలిస్తే అవాక్కవుతారు..

ఆ యువతులు చూడ్డానికి చాలా హుందాగా కనిపించారు. అంతా కలిసి ఓ షోరూంలోకి వెళ్లారు. యువతులంతా డబ్బున్న వారిలా కనిపించడంతో దుకాణ సిబ్బంది వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో షాపు మొత్తం కలియతిరిగిన వారు.. కాసేపటి తర్వాత వెళ్లిపోయారు. అయితే తర్వాత షాపులో చాలా వస్తువులు కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. మొత్తం తనీఖీ చేసి చివరకు షాక్ అయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.

Girls Robbery: దుకాణంలోకి మూకుమ్మడిగా చొరబడిన యువతులు.. ఇంతకీ వారు చోరీ చేసిన వస్తువులేంటో తెలిస్తే అవాక్కవుతారు..

డెన్మార్క్‌లోని (Denmark) హోవ్‌లోని టెస్కో ఎక్స్‌ప్రెస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ఓ పెద్ద నిత్యవసరాల దుకాణానికి (shop) కొందరు యువతులు మూకుమ్మడిగా వచ్చారు. వారంతా హుందాగా ఉండడంతో షాపు సిబ్బంది.. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇంకేముందీ.. యువతులంతా కలిసి షాపు మొత్తం కలియతిరిగారు. ఈ మధ్యలో వారికి కావల్సిన వస్తువులను మొత్తం మూడో కంటికి తెలీయకుండా నొక్కేశారు. తర్వాత అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఏమీ కొనకుండానే వెళ్లడంతో వారిపై సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో షాపు మొత్తం తనిఖీ చేశారు.

Digital payments: ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా ఇంతమంది నష్టపోతున్నారా.. సర్వేలో షాకింగ్ వాస్తవాలు..

దుకాణంలో వందల పౌండ్ల విలువైన సిగరెట్లు (Cigarettes) తదితర వస్తువులు కనిపించకపోవడం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని సీసీ టీవీ ఫుటేజీని (CCTV footage) పరిశీలించారు. దీంతో యువతుల బాగోతం మొత్తం బయటపడింది. జూలై 18న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు. చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Live in relationship: సహజీవనం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారి.. నాలుగు నెలల తర్వాత.. సడన్‌గా ఊహించని పరిణామం..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Atrocity on woman: అటవీ ప్రాంతంలో వివస్త్రగా పడి ఉన్న మహిళ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఏం జరిగిందని ఆరాతీయగా..young woman Kidnapped: ప్లీజ్ వద్దంటూ వేడుకుంటున్నా.. వినిపించుకోని యువకులు.. ఇంట్లోకి వచ్చి యువతిని బలవంతంగా.. videoSnake in Shiva temple: శివాలయంలో పూజలు చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. శివలింగంపైకి వెళ్లడంతో..ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..videoInstagram friendship: ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన పైలట్.. ఏకంగా 30మంది మహిళలతో.. చివరకు తెలిసింది ఏంటంటే..Bank Cash: బ్యాంక్‌కు వెళ్లిన 12ఏళ్ల బాలుడు.. రూ.35లక్షల బ్యాగుతో తిరిగొచ్చాడు.. చివరకు అధికారులు ఆరాతీయగా..video
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.