Digital payments: ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా ఇంతమంది నష్టపోతున్నారా.. సర్వేలో షాకింగ్ వాస్తవాలు..

ABN , First Publish Date - 2022-08-05T21:21:06+05:30 IST

ప్రస్తుత రోజుల్లో నగదు చెల్లింపులన్నీ దాదాపు ఆన్‌లైన్‌ ద్వారానే (Online Payments) జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్‌ సంఖ్య వరుసగా పెరుగుతూ..

Digital payments: ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా ఇంతమంది నష్టపోతున్నారా.. సర్వేలో షాకింగ్ వాస్తవాలు..

ప్రస్తుత రోజుల్లో నగదు చెల్లింపులన్నీ దాదాపు ఆన్‌లైన్‌ ద్వారానే (Online Payments) జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా డిజిటల్ పేమెంట్స్‌ సంఖ్య వరుసగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు డిజిటల్ పేమెంట్స్‌ చేసేవారిని టార్గెట్‌గా చేసుకునే సైబర్‌ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పేమెంట్స్‌ (Digital payments) చేసి ఎంతమంది మోసపోయారు, ఎంతమందికి ఆ డబ్బులు తిరిగొచ్చాయనే విషయంపై లోకల్ సర్కిల్ అనే ఓ సంస్థ సర్వే చేసింది.


గతేడాది అక్టోబర్‌లో లోకల్ సర్కిల్ సంస్థ.. దేశవ్యాప్తంగా 301 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 32 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 43 శాతం మంది టైర్-1 నగరాల నుంచి, 27 శాతం టైర్‌-2 నగరాల నుంచి, మిగతా 30 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఇందులో 33 శాతం మంది ప్రజలు.. తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ (Debit card Credit card) వివరాలను ఇమెయిల్ (Email) లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకుంటున్నట్టు తెలిపారు. 29 శాతం మంది ఏటీఎం పిన్‌ వివరాలను కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నట్లు.. 11 శాతం మంది మొబైల్ ఫోన్‌లో దాచుకుంటున్నట్లు చెప్పారు. అలాగే 4 శాతం మంది ప్రజలు.. తమ సహుద్యోగులతో పంచుకుంటున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. ఆర్బీఐ వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 60,414 కోట్ల ఆర్థిక మోసాలు జరిగినట్లు తెలిసింది.

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..


కాగా, గత మూడేళ్లలో 29 శాతం ఆన్‌లైన్‌ మోసాలు, 24 శాతం ఈకామర్స్‌, 21 శాతం ఇతర మోసాలు, 18 శాతం మొబైల్ యాప్స్‌ ద్వారా, 12 శాతం ఏటీఎం కార్డుల ద్వారా మోసాలు (Online scams) జరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. అయితే, గత మూడేళ్లలో డిజిటల్ పేమెంట్స్‌ చేసి కొన్ని లక్షల కోట్లు మోసపోతే.. వందలో కేవలం 17 శాతం మందికి మాత్రమే ఆ డబ్బులు వెనక్కి వచ్చినట్లు తేలింది. 73 శాతం మందికి ఇంకా ఆ డబ్బులు రాలేదు. మరోవైపు ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి మోసపోతే.. వెంటనే ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ సూచించింది. ఆన్‌లైన్‌ డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తుండాలని పేర్కొంది.

Snake in Shiva temple: శివాలయంలో పూజలు చేస్తుండగా సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాము.. శివలింగంపైకి వెళ్లడంతో..



Updated Date - 2022-08-05T21:21:06+05:30 IST