మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ( Bodhan MLA camp office ) మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ఫర్నిచర్ తరలిస్తున్నారు. కార్యాలయంలోని ఏసీలు, ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, కుర్చీలు, టేబుళ్లు, వాటర్ ట్యాంక్‌లు తరలించడానికి యువకులు యత్నించారు.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు
కొడంగల్‌లో చెల్లని రూపాయి.. కామరెడ్డిలో గెలుస్తుందా?, రేవంత్ రెడ్డికి కామారెడ్డిలో 3వ స్థానమే. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో ఉద్యమాల గడ్డ కామారెడ్డిపై నీ కథలు సాగవు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.
నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ను నమ్ముదామా? లేదా కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రజల నుద్దేశించి ప్రశ్నించారు.
డిచిపల్లి మండలం బర్దిపూర్ శివారులోని మహేంద్ర కార్ల షో రూమ్‌లో చోరీ జరిగింది. ఈ చోరీలో 60 వేలు, 6 సెల్‌ఫోన్‌లు దొంగలు ఎత్తికెళ్లారు. లాకర్‌ను ఎత్తుకు వెళ్లే క్రమంలో అధిక బరువు ఉండడంతో షోరూమ్ వెనుక భాగంలోని చెత్త కుప్పలో దాచారు.
ఒకే కుటుంబం అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంది. కాళేశ్వరం ద్వారా జేబులు నింపుకున్నారు. మీ దృష్టి ఇసుక దందాలు, కాంట్రాక్టుల మీద ఉంది కానీ ప్రజా సంక్షేమం మీద లేదు. సర్కారు నడిపే పద్ధతి ఇది కాదు.. మంది సొమ్ము
‘‘నేను కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లిన మీ గుండెల్లోనే ఉంటా’’ అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.
నిజామాబాద్ కి చెందిన కాంగ్రెస్ నేతలు ఇవాళ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali)ని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ అర్బన్(Nizamabad) నుంచి షబ్బీర్ కి కాంగ్రెస్(Congress) పార్టీ టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.