Home » YSRCP Cadre
ఏపీ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2 పథకాలతో పాటు విద్య పథకాల ద్వారా కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణే జగన్ అసహనానికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇలాంటి సంక్షమ పథకాలను చూసి జగన్ అండ్ కో ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతుండటాన్ని తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
పులివెందులలో గత ఐదేళ్లలో వైసీపీ కార్యకర్తలను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కార్యకర్తలు జగన్‌ను పులివెందులలో బండబూతులు తిడుతున్నారని ఆరోపించారు. పులివెందులలో ఉహించిన దానికన్నా మెజార్టీ ఎ్కువ వచ్చిందని ఉద్ఘాటించారు. రీ పోలింగ్ అడిగింది వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డినేనని.. రీ పోలింగ్‌లో కూడా ప్రజలు కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి పట్టం కట్టారని నొక్కిచెప్పారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్‌ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
పులివెందులల్లో సాక్షి మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. ఏపీ నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. వాళ్లకు వాళ్లే దాడి చేసుకొని తమపై నింద వేయడానికి ప్లాన్ చేస్తున్నారని బీటెక్ రవి ధ్వజమెత్తారు.
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్‌లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
అత్యుత్తమ విధానాలతో ఏపీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీ చాలా బాగుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులు శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా 12 మంది నిందితులకు ఈనెల13వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.