Home » YS Jagan
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఏపీలో ప్రవేశించవద్దని హైకోర్టు గతంలో షరతులు విధించింది. అయితే ఆ షరతులను సడలించాలని తాజాగా భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. పులివెందులలో తనకు వ్యవసాయం ఉందని, అనారోగ్యంతో ఉన్నానని ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో వివరించారు.
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
కృష్ణా డెల్టా తూర్పు కెనాల్ కింద ఉన్న గుడివాడ, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో సాగునీటి సమస్యలని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈస్టర్న్ కెనాల్ కు 10,400 క్యూసెక్కుల నీరు..
ఏపీలో వైఎస్ జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్కైంది. దీంతో చెవిరెడ్డి గ్యాంగ్ మొత్తం బాగోతం బట్టబయలైనట్లైంది. డబ్బుల డెన్ లో వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి రిట్రీవ్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలు సైకో పాలన చూశారని, గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తల్లి, చెల్లికి అన్యాయం చేసిన వైఎస్ జగన్ అసలు నాయకుడిగా పనికొస్తాడా..? అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సొంత తల్లి, చెల్లి మీద కేసులు పెట్టిన జగన్ రాష్ట్ర మహిళలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమాపై చేసిన ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఎందుకు ఆయన ఇలాంటి సందేశం ఇచ్చారనే దానిపై..
మద్యం స్కాం ముడుపుల్లో సింహ భాగం జగన్‌కే చేరినట్లు బట్టబయలైంది. ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల దాకా నిందితులు జగన్‌కు చేర్చినట్లు సిట్ అధికారులు తేల్చారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.