Home » YS Jagan
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ క్రెడిట్ చోరికి పాల్పడుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు విమర్శించారు. బుధవారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
వ్యవస్థలు నిర్మాణం చేద్దామనే సంకల్పంతో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కానీ వ్యవస్థల్ని నాశనం చేయటమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ అధినేత ఉన్నారంటూ వైఎస్ జగన్‌పై ఆయన మండిపడ్డారు.
రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని.. రైతులను ప్రభుత్వం ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్‌మెంట్లతో మరింత నష్టం చేయొద్దని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. వైసీపీని జీరో చేసి జగన్ నోరు నొక్కడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధానిపై జగన్‌కు కనీస అవగాహన లేదన్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో నాటకాలు వేశారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభివర్ణించారు. పాత సారాని కొత్త సీసాలో నింపి మార్కెటింగ్ చేసినట్లు వైఎస్ జగన్ వ్యవహారం ఉందన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.