Home » Yogi Adityanath
మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఉత్తర్ ప్రదేశ్: బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఐదుగురు భక్తులు మృతిచెందగా.. 50 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
మహాకుంభ్‌లో అన్నపానాదులు, బసకు ఎలాంటి కొరతా లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సామరస్యం, కరుణ, అందరూ ఒక్కటేనన్న సందేశాన్ని మహాకుంభ్ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పనున్నామని తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల వేళ అధికార ఆప్, బీజేపీ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ రాజధానిలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడంతో ఆప్ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గీతాప్రెస్‌కు చెందిన సెక్టార్ 19లో ఆదివారం మధ్యాహ్నం 4.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని 10 టెంట్లకు పాకడంతో పోలీసులు, స్థానిక యంత్రాంగం అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసినట్టు ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.
పుష్కరాల తొలిరోజైన సోమవారంనాడు 1.75 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించగా, మంగళవారం మధ్యాహ్నం వరకూ మరో 1.38 కోట్ల మంది పాల్గొన్నారు.
సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజా సమస్యల నుంచి దారిమళ్లించేందుకు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు జరుపుతోందని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.
ప్రపంచ నాగరికతను పరిరక్షించాలంటే సనాతన ధర్మం, విలువలను కాపాడాలని యోగి హితవు పలికారు. పురాతనకాలం రుషులు వసుధైక కుటుంబానికి పిలుపునిచ్చారని గుర్తుచేశారు.