Home » Weather
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనున్నది. ఆ తరువాత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గురువారం నుంచి కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణ - రాయలసీమ - తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావ కొనసాగుతోందని ఏపీ వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. రుతుపవన మేఘాల జాడ లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఇంకా పడమర దిశ నుంచి పొడి గాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొంది.
ఎల్‌నినో ప్రభావంతో దక్షిణభారతంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారాయి. తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి తేమగాలుల రాక నిలిచిపోయింది. దీంతో పడమర భారతం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా కోస్తాంధ్ర వైపు పొడిగాలులు వీస్తున్నాయి.
ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.
పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి, అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) తెలిపింది.