Home » Viveka Murder Case
వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి (YS Sunita Reddy) బయటపెట్టారు. పక్కా స్కెచ్ వేసి తన నాన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను సీఎం జగన్ పక్కన పెట్టాలని చూశారని.. అయినా ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వారి అరాచకాలకు అడ్డువస్తున్నారనే అక్కసుతో హత్య చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలన్నదే వివేకా కోరిక అని చెప్పారు.
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..?..
వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. అవినాష్ రెడ్డిని ఓడించడమే తన లక్ష్యం.. వీలైతే జగన్‌ను ఓడించాలి.. ప్రస్తుతానికి ఇదే తన లక్ష్యం అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలుసునని, ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని ఆమె అన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు హత్యలు, దోపిడీలు, ఇతర చట్టవ్యతిరేక అంశాలు బయటకొస్తే, వాటిని ప్రత్యర్థిపై నెట్టేసి, తన రోత మీడియా ద్వారా ప్రజల్లో దుష్ప్రచారం చేయడానికి వేసిన ఎత్తులు..
ఏపీలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ ఏ-8గా చేర్చింది. దీంతో ఆయన బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.