Share News

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌కు షాక్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:54 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

MP Avinash Reddy: ఎంపీ అవినాష్‌కు షాక్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తమ పిటిషనర్‌ బెయిల్ రద్దు చేయాలని.. కోరే అధికారం అప్రూవర్‌ దస్తగిరికి లేదని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు.

ఈ కేసులో నెల రోజుల క్రితమే ఎన్ఐఏ కేసులో అప్రూవర్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు పేర్కొంది. అప్రూవర్‌కి అడిగే హక్కు డివిజన్ బెంచ్ తీర్పులో స్పష్టంగా ఉందని న్యాయస్థానం తెలిపింది. అప్రూవర్ దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది.

Chandrababu Prajagalam Meeting: భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్‌పై చంద్రబాబు ఫైర్

తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై CBI కౌంటర్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 3కు విచారణ వాయిదా వేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 05:24 PM