Home » Visakhapatnam
వడదెబ్బ బాధితుల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని కేజీహెచ్ సూపరింటెండెంట్, డాక్డర్ వాణి తెలిపారు. ఈ వార్డులో ఏసీతో పాటు,18 బెడ్స్ ఉంటాయన్నారు.
విశాఖపట్నంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రాజకీయాలలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత ప్రస్థానాన్ని ఆవిష్కరించే ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ రోజు (ఆదివారం) విశాఖ మద్దిలపాలెంలోని కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
విశాఖ నగరంలో చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా విశాఖ క్రైమ్ విభాగం పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఏప్రిల్ నెల ‘రికవరీ మేళా’లో రికార్డు స్థాయిలో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు.
విశాఖపట్నంలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. హోం మంత్రి ప్రోత్సాహంతో మొదటి విడతగా 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా అందించనున్నారు.
క్రైస్తవ మత ప్రచారకుడు, నటుడు అభినయ్ దర్శన్ వ్యవహారంపై హోం మంత్రి అనిత స్పందించారు. అభినయ్ దర్శన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని అన్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత బంటుపల్లి ఇందుమతి (40) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. విశాఖపట్నం సింహాచంలో ఈ ఘటన జరిగింది.
ప్రజలకు చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీసుస్టేషన్‌లను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని పేర్కొన్నారు.
మహానాడు రద్దుపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలతో ఇంధన వనరులు ఆదా చేసుకునే నేపథ్యంలో భాగంగా నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని రద్దు చేశామని తెలిపారు.