Vizag Port: విశాఖపట్నం పోర్ట్ వరల్డ్ టాప్ 20 : కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:28 PM
విశాఖపట్నం పోర్ట్ ప్రపంచంలోని 20 అద్భుత నౌకాశ్రయాలలో ఒకటని కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్ చెప్పారు. భవిష్యత్తులో క్రూయిజ్ రంగానిది కీలక పాత్ర అని..
విశాఖపట్నం, జులై 14 : విశాఖపట్నం పోర్ట్ ప్రపంచంలోని 20 అద్భుత నౌకాశ్రయాలలో ఒకటని కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్ చెప్పారు. ఇవాళ విశాఖ వచ్చిన ఆయన 320 కోట్ల రూపాయలతో చేసిన పోర్ట్ ఆధునీకరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి బిమ్స్ టెక్ పేరుతో మ్యారి టైం కాంక్లేవ్ నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన నిఫుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సదస్సులో అంతర్జాతీయ వాటర్ వేస్, మారిటైమ్ ట్రేడ్ కి సంబంధించి అర్థవంతమైన చర్చ జరిగింది. ఈ సందర్భంలో మారి టైం ట్రాన్స్ పోర్ట్ అగ్రిమెంట్ జరిగింది. ఈ కాంక్లేవ్ కు ఆరు దేశాల నుండి 26 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి 'ఈ రోజు జరిగిన కాంక్లేవ్ మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం. మారిటైమ్.. ట్రేడ్స్ పై ఫలప్రదమైన చర్చ జరిగింది. భవిష్యత్తులో క్రూయిజ్ రంగం కీలకంగా పనిచేస్తుంది. విశాఖ పోర్టు ప్రపంచంలో టాప్ 20 లో ఉంది. విశాఖపట్నం పోర్టు పరిధిలో 320 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశాం.' అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి ఠాకూర్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి