Home » Vijayawada
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని విజయవాడలో పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రెండేళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి, ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్‌వేపైనే ఆగిపోయింది.
ఎంపీ కేశినేని శివనాథ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎంపీపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ నాని, అతని అనుచరులు చేసిన దుష్ప్రచారంపై పోలీసులకు ఎంపీ చిన్ని కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేసింది.
కృష్ణా జిల్లాలోని స్వామి ఆలయ ఆవరణలో ఓ భక్తురాలు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రాత్రి సమయంలో స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఆమె.. ఆలయ ప్రాంగణంలోనే నిద్రపోయింది.
చెరువు మీద పచ్చగా పరుచుకునే గుర్రపు డెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కృష్ణా జిల్లా కేసరపల్లిలోని శ్రీ చైతన్య గాయత్రి వేదవ్యాస్ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అనంతపురం జిల్లాకు చెందిన కప్పల యశ్వంత్(18) హాస్టల్ గదిలో మృతి చెందగా, ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
విజయవాడ వేదికగా ‘రెడ్ బెలూన్ ఏరోస్పేస్’ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించిన ‘సూపర్ ప్రెషర్ బెలూన్’ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.