Home » Videos
ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ.. 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధంలో పాల్గొన్న జవాన్లు తమ అనుభవాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
పాక్ చర్యలను బట్టే ప్రతి చర్యలు ఉంటాయిన భారత్ తేల్చి చెప్పింది. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని.. ద్రోణు దాడులను సమర్థంగా తిప్పి కొట్టామని భారత్ స్పష్టం చేసింది. పాక్‌లోని కీలక నగరాలే టార్గెట్‌గా దాడి జరిగింది. పాక్ చర్యలను బట్టే భారత్ ప్రతిచర్యలు ఉంటాయిని పేర్కొంది. కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేశామని భారత్ వివరించింది.
తెలంగాణలో మాటలు మంటలు కొనసాగుతోన్నాయి. రాష్ట్ర ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విపక్షాలు ఎదురు దాడికి దిగాయి. ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లాది రూపాయిలు వెచ్చించి నిర్మించిన చర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ప్రధాన భవనం డొల్లతనం బయటపడింది. శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షానికి టెర్మినల్ పైభాగాలతోపాటు సోలార్ ప్లేట్లు విరిగి పడ్డాయి. మూడు నెలల క్రితం ఎంతో అట్టహాసంగా ఈ స్టేషన్ ప్రారంభమైంది. తొమ్మిదో నెంబర్ ప్లాట్ ఫామ్‌ను అనుకొని ఉన్న ప్రవేశ ద్వారం షీట్లతోపాటు రేఖులు, ఈ ఫలకాలు ఊడి పడ్డాయి.
తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్టేడ్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు పేర్కొంది. ఏయే జిల్లాలో వర్షాలు పడనున్నాయో వెల్లడించింది.
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. తమ నోటికి పని చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్‌పై పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే పునాది వేస్తారు. కొత్త బాబ్రీ మసీద్‌కు మొదటి ఇటుకను..
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ క్రమంలో పొరుగునున్న బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద సైతం భద్రతను
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
సింహాచలం ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ట్రంప్ దెబ్బకు అమెరికా సంక్షోభంలో కూరుకు పోవడం ఖాయమైందా?.మనం గొప్పగా చెప్పుకుంటున్నా డాలర్..నేల చూపులు చూస్తోందా? డాలర్ లేకుంటే.. మనం బతకలేమా అనే సందేహం కలుగుతోందా?