Home » Vallabhaneni Vamsi Mohan
వంశీ అరెస్టు ఆయన చేసిన కర్మ ఫలం. తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది’ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
‘చంద్రబాబూ... మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నా’ అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.
ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేరమనస్తత్వం ఉన్నవారో అర్ధమవుతోంది.
గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు.
అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అక్కడి అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల కోసం చిందులు తొక్కారు.
Chintamaneni Prabhakar: వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వంశీ అనుచరుల వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు.
Dola Bala Veeranjaneya Swamy:వైసీపీ నేతలకు మంత్రి బాలవీరాంజనేయస్వామి మాస్ వార్నింగ్ ఇచ్చారు. వారు మారకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ నేత వల్లభనేని వంశీ దుశ్చర్యల గురించి మాట్లాడామని తెలిపారు.
కృష్ణలంక పీఎస్‌లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటలపాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం వంశీని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్టేషన్ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ పక్క గేటు నుంచి వంశీని ఆస్పత్రికి తరలించారు..
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన ఫిర్యాదు చేసి.. వెనక్కి తీసుకున్న సత్యవర్థన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తీసుకు వచ్చి.. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.