• Home » Uttarakhand

Uttarakhand

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

Lok Sabha Polls 2024: ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో పోలింగ్.. క్లీన్‌స్వీప్‌పై కమలం గురి..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్‌పై కమలం పార్టీ గురి పెట్టింది.

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

UCC: ఉత్తరాఖండ్‌ ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. మతంతో సంబంధం లేకుండా వివాహాలు, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వ చట్టాలు అందరికీ ఒకేరీతిలో వర్తించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా, బిల్లు సభామోదం పొందింది.

Kedarnath Dham: కేదార్‌నాథ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

Kedarnath Dham: కేదార్‌నాథ్ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

Dehradun News: కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(BKTC) శుభవార్త చెప్పింది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ ప్రకటన చేసింది. మే 10వ తేదీన భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు.

BJP: బీజేపీ సీఈసీ సమావేశంలో 16 రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులపై చర్చ..!

BJP: బీజేపీ సీఈసీ సమావేశంలో 16 రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులపై చర్చ..!

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Uttarakhand: నిరసనల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారా.. అయితే మీ ఆస్తులన్నీ పోయినట్లే

Uttarakhand: నిరసనల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారా.. అయితే మీ ఆస్తులన్నీ పోయినట్లే

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి ధ్వంసం కేసుల్లో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎవరు భరిస్తారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అలాంటి కేసుల్లో ఆస్తి నష్టం పూర్తి భారాన్ని నిందితులపై పెట్టాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.

Haldwani: హల్ద్వానీ ఘటనలో కీలక సూత్రధారి అరెస్టు.. హింసకు కారణమిదే..

Haldwani: హల్ద్వానీ ఘటనలో కీలక సూత్రధారి అరెస్టు.. హింసకు కారణమిదే..

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ హింస ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో హింస చెలరేగింది. బంభూల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చేశారు.

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Uttarakhand: మదర్సా ఘటనలో 4కి చేరిన మ‌ృతుల సంఖ్య.. 250 మందికిపైగా గాయాలు

Uttarakhand: మదర్సా ఘటనలో 4కి చేరిన మ‌ృతుల సంఖ్య.. 250 మందికిపైగా గాయాలు

ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత(Masjid Demolition) ఘటనలో జరిగిన హింసలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 250కిపైగా గాయపడినట్లు వివరించారు.

Uttarakhand: అక్రమ మసీదు కూల్చివేత.. ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు..

Uttarakhand: అక్రమ మసీదు కూల్చివేత.. ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు..

ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. వాహనాలకు నిప్పు పెట్టడంతో పలు వెహికిల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగింది.

Live-in Relationship: సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి.. లేకపోతే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా

Live-in Relationship: సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి.. లేకపోతే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా

ఎవరైతే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, అలాగే ఎవరైతే సహజీవనం చేయాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లు తమ రిలేషన్‌ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే.. వారి బంధానికి తల్లిదండ్రుల సమ్మతి కచ్ఛితంగా అవసరం అవుతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి