Home » Traffic Police
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్‌వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్ రూట్‌లోకి వెళ్తున్నారు.
H- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది.
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. H-City ప్రాజెక్ట్ పనుల దృష్ట్యా ఈ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాగే ఈనంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 2 నుంచి 4వ తేదీ తెల్లవారు జామున 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
విధుల సమయంలో ట్రాఫిక్ పోలీసులు వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ అమలు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలకు ప్రతిపాదన చేసింది.