Home » Tirupathi News
పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తిరుపతి సమీపంలోని పాకాల అడవిలో ఈనెల 14న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అందులో ఓ మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దే అని తేలింది.
ఎంత చదువుకున్నా.. ఎంత పరిజ్ఞానమున్నా సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మేవాళ్లే ఎక్కువ. వాళ్ల ఉచ్చులోపడి లబోదిబోమనే వాళ్లే. కానీ, తిరుపతికి చెందిన శానిటేషన్ వర్కర్ ఒకరు మాత్రం మీ వేషాలు నా దగ్గర కాదంటూ సోమవారం తనకు ఫోనుచేసిన అమ్మాయికి దీటుగా ఎదురు తిరిగారు.
పనపాకం రిజర్వు ఫారెస్ట్ ఫరిధిలో ఇద్దరి వ్యక్తుల మృతదేహాల గుర్తింపులో చిక్కుముడి వీడలేదు. ఇక్కడి అడవిలో రెండు మృతదేహాలను ఆదివారం సాయంత్రం గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన విషయం తెలిసిందే. సీఐ సుదర్శన్ ప్రసాద్, తహసీల్దార్ సంతోష్ సాయి, సిబ్బంది సోమవారం వెళ్లి పరిశీలించారు.
టీటీడీ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు అమలు కానున్న 33శాతం రిజర్వేషన్లు ఈ లోటును మారుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
చంద్రయాన్‌లో మహిళల పాత్ర భారతీయుల విలువను పెంచిందని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. ఆశా వర్కర్ నుంచి ఐఏఎస్ వరకు, గ్రామపంచాయతీ నుంచి పార్లమెంటరీ సభ్యురాలి వరకు మహిళల ఉనికి పెరుగుతోందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఉద్ఘాటించారు. మహిళా సాధికారత ఒక్క రోజులో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటేనే మహిళా సాధికారత సాధించగలమని ఓంబిర్లా పేర్కొన్నారు.
రాష్ట్ర,కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండు రోజుల పాటు జరుగనుంది. మొదటి రోజు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే వర్షం పడుతోండటంతో పర్యటనను రద్దు చేసుకున్నారు.